నిజానికి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం పై రెండు రాష్ట్రాలు రెండు విధానాలను అమలు చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వైన్స్, బార్ ల సంఖ్యను గణనీయంగా తగ్గించింది ప్రభుత్వం. దీంతో ప్రతి దానికి పోటీ పడే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయంలో కూడా చర్చ మొదలైంది.

 

తెలంగాణ సర్కార్ తీసుకున్న తీరును ప్రశ్నిస్తూ బీజేపీ కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి డీకే అరుణ రెండు రోజుల పాటు హైదరాబాద్లో నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్ లో జరిగిన ఈ దీక్షకు మద్యం వల్ల ఇబ్బంది పడిన కుటుంబీకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దీక్షకు హాజరైన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

 

 దేశంలోనే తెలంగాణను లిక్కర్ కింగ్ రాష్ట్రంగా చేసేలా గా ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ కు మాత్రమే చెందుతుంది అని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ఎన్నో అనవసరపు ఖర్చులు చేస్తున్న కేసీఆర్, ఆదాయం కోసం మద్యం అమ్మకాలని పెంచుకుంటున్నారని అని చెప్పారు. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 25 శాతం కేవలం మద్యం అమ్మకాల ద్వారానే వస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

 

ఈ సందర్భంగా ఆయన మంత్రి కేటీఆర్ పై కూడా విరుచుకుపడ్డారు ఆయన మనది పబ్ కల్చర్ అని ప్రజల్ని  ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ కి సంబంధించిన ప్రముఖ స్లోగన్ వాడుకున్నారు. బీజేపీ బేటీ బచావో.. బేటీ పడావో అంటే… కేసీఆర్ మాత్రం బార్ బచావో బార్ బడావో అని అంటున్నరని అన్నారు. లిక్కర్ ద్వారా ఎన్ని నేరాలు జరిగినా సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: