ఎక్కడైనా ప్రతిపక్షం ఉందటే...అధికార పార్టీ ఏం చేసిన దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటుంది. వీలు దొరికిన ప్రతి చోటల్లా అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటుంది. అయితే ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా ఇదే తరహాలో అధికార వైసీపీ ఏ నిర్ణయం తీసుకున్న వ్యతిరేకిస్తూనే వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం, ప్రతి నిర్ణయంపై విమర్శలు గుప్పించింది. అయితే టీడీపీ ఎన్ని విమర్శలు చేసిన, జగన్ ప్రభుత్వానికి ప్రజల మద్ధతు దక్కుతుందనే ఉంది.

 

మరి ఆ విషయం టీడీపీకి అర్ధమైందో ఏంటో తెలియదుగానీ....తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు చంద్రబాబు మద్ధతిస్తున్నారు. ఇటీవల ఏపీలో 1 నుంచి 6వ తరగతి వరకు ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై తాజాగా ఏపీ అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. అలాగే తెలంగాణలో దిశ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై ఓ చట్టాన్ని తీసుకొచ్చి, దానికి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.

 

ఈ రెండు విషయాల్లోనూ జగన్ కు ఫుల్ క్రెడిట్ వచ్చింది. ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది. ఇలాంటి సమయంలో తాము ఏమన్నా అటు ఇటుగా మాట్లాడితే ప్రజల్లో మరింత చులకన అయిపోతామనే భావనతో చంద్రబాబు రెండు విషయాలకు మద్ధతు ఇచ్చారు. కనీసం మద్ధతు తెలపడం వల్ల అయిన కాస్త మన పట్ల కూడా ప్రజలు సానుకూలంగా ఉంటారని బాబు ఆలోచనగా తెలుస్తోంది. లేదంటే ప్రజల్లో ఇంకా దిగజారిపోయే వారు.

 

అసలు ఇంగ్లీష్ మీడియం ప్రకటన వచ్చినప్పుడు టీడీపీ వ్యతిరేకించింది. కానీ ప్రజలు ఈ నిర్ణయానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో బాబు యూ టర్న్ తీసేసుకున్నారు. ఇక మహిళల భద్రత విషయంలో చట్టం తెస్తే ఎవరైనా మద్ధతు తెలపాల్సిందే...అందుకే బాబు కూడా దిశ చట్టానికి మద్ధతు తెలిపారు. మొత్తానికి జగన్ కు క్రెడిట్ పోతుందని అర్ధమయ్యే బాబు....జగన్ ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: