రాజకీయాల్లో వయసు మీదపడిన రాజకీయాలు చేసే నేతలు చాలమందే ఉంటారు. వారికి ఉండే ఫాలోయింగ్, రాజకీయ చతురత కారణంగా వారు ఇంకా రాజకీయాల్లో మనుగడ సాగించగలుగుతారు. ఉదాహరణకు మొన్న మహారాష్ట ఎన్నికల్లో 80 ఏళ్ల శరద్ పవార్ ఏ విధంగా సక్సెస్ అయ్యారో అందరూ చూశారు. ఇక చనిపోయే వరకు తమిళనాడులో కరుణానిధి రాజకీయాలు చేశారు. అయితే ఏపీలో 70 ఏళ్ల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజకీయాలు చేస్తున్నారు. కాకపోతే ఆయన మునుపటిలా లేరు. రాజకీయ వ్యూహాల్లో వెనుకబడిపోయారు. తనకంటే 24 ఏళ్ళు చిన్నోడైన సీఎం జగన్ ముందు పూర్తిగా తేలిపోతున్నారు.

 

ఈ క్రమంలోనే ఆయన మున్ముందు రాజకీయ భవిష్యత్తు పట్ల ప్రజల్లో కూడా అనుమానాలు వస్తున్నాయి. అటు సొంత పార్టీలో కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. అయితే సత్తా తగ్గిపోయినా...సొంత పార్టీ వాళ్లే డౌట్ గా ఉన్న ఆయన మాత్రం డప్పు కొట్టడం మానడం లేదు. తన వయసు 70 అయిన.....మైండ్ 25 ఏళ్ల కుర్రాడిలా ఆలోచిస్తుందని చెబుతున్నారు. పైగా ఎంతమంది ఎదురుగా వచ్చిన సమాధానం చెప్పగలని మాట్లాడుతున్నారు.

 

అయితే ఇవన్నీ వినడానికే బాగున్నాయి గానీ...ఆచరణలో మాత్రం ఏం ఉండటం లేదు. నిన్నగాక మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఆయన్ని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ప్రతిఒక్కరు ఆయన్ని ఓ రేంజ్ లో ఎగతాళి చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రోజు ఆయన వయసు గురించి ఎవరోకరు...ఏదొకటి మాట్లాడుతూనే ఉన్నారు. చంద్రబాబుకు మానసిక జబ్బు చేసిందని, ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాలని, రాజకీయాల్లో ఆయన సేవలు చాలని, ఇక ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అప్పలరాజు కామెంట్ చేశారు.

 

అటు చంద్రబాబు వయసు 25 అయితే...లోకేశ్ వయసు 70న అంటూ అంబటి ఓ రేంజ్ లో సెటైర్ వేశారు. చంద్రబాబు ఎప్పుడో సిక్సర్లు కొట్టి...ఇప్పుడు నాటౌట్ అంటే ఎలా అంటూ గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. ఇక జగన్ అయితే చంద్రబాబుకు వయసు పెరుగుతుంది గానీ బుద్ది పెరగలేదని మాట్లాడేశారు. ఇలా చాలామంది వైసీపీ నేతలు రోజు బాబు వయసుపై కామెంట్లు చేస్తూనే ఉన్నారు.  ఇక వీరి మాటల బట్టి చూస్తే చంద్రబాబు వయసుతో పాటు రాజకీయ చతురత కూడా తగ్గిపోయిందని అనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: