ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో తుపాను వచ్చింది. దాని ధాటికి సముద్రంలో నుంచి కొన్ని వేల పురుషాంగాలు ఒడ్డుకుకొట్టుకొచ్చాయి. అదేంటి.. పురుషాంగాలు కొట్టుకురావడం ఏంటి అనుకుంటున్నారా.. వాస్తవానికి అవి పురుషాంగాలు కావు.. కానీ అచ్చు అలాగే ఉంటాయి. ఒకటి కాదు... రెండు కాదు వేల సంఖ్యలో అలాంటివి కొట్టుకొచ్చాయి. మరి ఇంతకీ అవేంటనేగా మీ సందేహం. అవి ఓ రకం చేపలు.

 

ఈ చేపలు అచ్చు మానవ పురుషాంగాన్ని పోలి ఉంటాయి. అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర తీరంలో ఇలాంటివి వేల సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మనకు కాస్త విచిత్రంగా అనిపిస్తున్నా.. అక్కడి జీవులకు ఇవి కాస్త అలవాటైన జీవులే. వీటిని లోకల్ గా.. పల్సింగ్ పెనిస్ ఫిష్ అంటారు. ఈ జీవులు చూడటానికి అచ్చంగా పురుషాంగంలా ఉండటంతో వీటికి ఆ పేరు వచ్చింది. ఇవి సాధారణంగా ఓ పది అంగుళాల పొడవు ఉంటాయి.

 

సముద్రం అడుగు భాగాన జీవిస్తుంటాయి. కాలిఫోర్నియా ఇటీవల వచ్చిన తుఫానుకు సముద్రం అల్లకల్లోలం కావడంతో ఇవి కాస్తా బయటకు వచ్చాయి. చూసేందుకు ఈ దృశ్యం ఇంట్రస్టింగా ఉండటంతో ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. ఇదే రకం సముద్రజీవిలు చైనాలోనూ ఎక్కువగా దొరుకుతాయట.

 

దాదాపు 300 మిలియన్ సంవత్సరాలుగా ఇవి సముద్ర తీరంలో ఉంటున్నాయని ఓ అంచనా. ఇవి సముద్రంలోని నాచు మొక్కలు, క్రిములను తిని బతుకుతాయట. ఇంట్రస్టింగ్ గా ఉంది కదా.. అందుకనే ఈ ఇంట్రస్టింగ్ వార్తను మీరు కూడా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.. వారిని ఆశ్చర్యపరచండి. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: