దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను పోలీసుల కేవలం కొన్ని గంటల వ్యవధిలో పట్టుకున్నారు. నేరం చేశామని వారి నోటితోనే ఒప్పించారు. అయితే అనూహ్యంగా నిందుతులు ఎన్ కౌంటర్ అయ్యారు. కానీ ఎన్ కౌంటర్ జరగకపోతే.. వారే నేరం చేశారని నిరూపించడం ఎలా.. అసలు రేప్ జరగిందని ఎలా నిర్థరిస్తారు. రేపు జరిగినా ఫలానా వ్యక్తే రేప్ చేశాడని ఎలా కన్ ఫామ్ చేస్తారు.. తెలుసుకుందాం..

 

రేప్ కేసుల్లో ఆధారాలు చాలా బలమైనవి.. నేరస్తులు మేం నేరం చేశామని అంగీకరించినా.. అందుకు తగిన సాక్ష్యాధారాలు శాస్త్రీయంగా కోర్టు ముందు ఉంచాలి. అలా నేరం చేశారని నిరూపించేందుకు వీర్య కణాల పరీక్ష కీలకమైంది. నిందితులను దోషులుగా నిలబెట్టేందుకు డీఎన్​ఏ, వీర్య కణాల పరీక్షలు చాలా కీలకం. ఈ వీర్యకణాల పరీక్ష ఎలా చేస్తారంటే..

 

ముందుగా.. బాధితురాలి దుస్తులు, లోదుస్తులు, తొడ భాగాలు, జననాంగాలు, వెంట్రుకలు, అత్యాచారం జరిగిన ప్రదేశంలోని నేల, వస్తువులపై వీర్యనమూనాల కోసం వెదుకుతారు. వాటిని సేకరిస్తారు. దాన్ని నిందితుల వీర్య కణాలతో కంపేర్ చేస్తారు. అత్యాచారం జరిగిన రెండు రోజుల్లోనే వీర్యకణాల పరీక్ష చేస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఆలస్యం అయితే పరీక్షలు ఫలించే అవకాశాలు తగ్గుతాయి.

 

అయితే అన్నిసార్లు ఈ వీర్యపరీక్షలు సక్సస్ అవుతాయని చెప్పలేం.. దుండగునికి తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉంటే ఈ పరీక్షలు ఫలించకపోవచ్చు. అలాగే అత్యాచారం సమయంలో నిందితుడు స్ఖలనం చేయకపోయినా ఫలితం రాకపోవచ్చు. ఒకవేళ బాధితురాలు రుతుక్రమంలో ఉన్నా కూడా పరీక్షలో ఫలితం తేలకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులేమీ లేని పక్షంలో వీర్యపరీక్షల ద్వారా నిందితుల నేరాన్ని పక్కాగా రుజువు చేయవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: