ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి . సాధారణంగా  ప్రతిపక్షం దాడికి అధికారపార్టీ లో ఆత్మరక్షణలో పడడం చూస్తుంటాం… కానీ ఏపీ అసెంబ్లీ శీతాకాల  సమావేశాల్లో మాత్రం అధికారపార్టీ ధాటికి ప్రతిపక్ష తెలుగుదేశం ఉక్కిరి బిక్కిరి అవుతుంది . సాగునీటి ప్రాజెక్టుల పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన తెలుగుదేశం పార్టీ సభ్యులకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కలతో ఒక్కసారి మతిపోయినంత పనయింది .

 

ఆర్నెల్ల వ్యవధిలో సాగునీటి ప్రాజెక్టులకు జగన్ సర్కార్ ఒక్క రూపాయ కూడా ఖర్చు చేయలేదని టీడీపీ సభ్యులు పేర్కొన్నప్పటికీ , సాగునీటి ప్రాజెక్టుల పేరిట టీడీపీ చేసిన దుబారాను ప్రస్తావించి వైస్సార్ కాంగ్రెస్ సభ్యులు ధీటుగా సమాధానం చెప్పారు  .  ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ విద్యాబోధన ప్రవేశపెట్టే అంశం పై జరిగిన చర్చలోనూ టీడీపీ సభ్యులు చేసిన విమర్శలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ధీటుగా తిప్పికొట్టారు . ఇక ఇదంతా ఒక ఎత్తయితే అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్ తో ఘర్షణ కు దిగి టీడీపీ సభ్యులు అభాసుపాలయ్యారు . మార్షల్స్ ను దూషించడం లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ పోటీ పడడం చూస్తే, వారు ఎంత అసహనం తో ఉన్నారో ఇట్టే స్పష్టం అవుతోంది .

 

మార్షల్స్ ను చంద్రబాబు బాస్టడ్ అని తిట్టిపోస్తే , ఇక లోకేష్ యూస్ లెస్ ఫెలో అనడం పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తోపాటు వైస్సార్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు  . సభ్యులు కానీ వారు సభలో ప్రవేశించేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకుంటే , టీడీపీ నేతలు వారిని దుర్భాషలు ఆడడం ఏమిటని వైస్సార్ కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించడం తో ఒక్కసారి ఆత్మరక్షణలో పడిపోయారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: