గత ఐదేళ్లలో చంద్రబాబు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల అంచనాలను పెంచి ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకుందని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈయన పరిటాల రవి తనయుడిని ఓడించిన సంగతి తెలిసిందే. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ఐదు తరాలకు సంబంధించిన ఆదాయాన్ని సంపాదించుకోవాలనే లక్ష్యంతో పాలన చేశారన్నారు.

 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్‌టెండరింగ్‌ విధానాన్ని తీసుకువచ్చి ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ‘గతంలో టెండర్ల ప్రక్రియలో ఎన్నడూ పారదర్శకత అనే పదానికి అర్థం లేకుండా టెండర్లు జరిగాయి. ఐదేళ్ల పాలనలో రూ.2.30 లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. సరాసరి 4.8 శాతం ఎక్సెస్‌ కోడ్‌ చేయడం జరిగింది. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా మొత్తం రూ.1486.87 కోట్లు జగన్‌ ప్రభుత్వం ఆదా చేసిందని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు.

 

పోలవరం హెడ్‌ వర్క్స్, లెఫ్ట్‌ కనెక్టివిటీ, జెన్‌కో బొగ్గు రవాణా, వెలుగొండ టన్నల్, కంప్యూటర్లు, ప్రింటర్స్‌ కొనుగోలు, 4జీ సిమ్‌కార్డు కొనుగోలు, టిట్‌కో.. ఇలా అన్నింటిలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని.. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. గతంలో 5 శాతం ఎక్సెస్‌ నుంచి ఈ రోజు దాదాపు 15 శాతం లెస్‌ కోడ్‌ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకుంటే టెండర్ల ప్రక్రియలో ట్రాన్స్‌ఫరెన్సీ తీసుకురావడం వల్లనే అంటూ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మెచ్చుకున్నారు.

 

చంద్రబాబు హయాంలో కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే టెండర్లలో పాల్గొనేవి.. బిల్డింగ్‌ నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.11 వేల కోట్‌ చేసిన పరిస్థితి నుంచి టిట్‌కోకు సంబంధించి రూ.707 కోట్ల టెండర్లను రూ.601 కోట్లకు కోడ్‌ చేశారు. అంటే రూ.106 కోట్లు ఆదా చేశారు. చదరపు అడుగుకు రూ.1310 కోట్‌ చేశారు. గతంలో రూ.11 వేలకు ఇప్పుడున్న రూ.1310కి తేడా గమనించాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: