జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తాను రాజకీయాల్లోకి రావడానికి ఎవరైతే స్ఫూర్తి అంటూ చెప్పుకుంటూ వచ్చాడో ఆ వ్యక్తి ఇప్పుడు పవన్ కల్యాణ్ పార్టీకి గుడ్ బై చెప్పాడు. అంతే కాదు.. పోతూ పోతూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ రాష్ట్రానికే ప్రమాదకరమని హెచ్చరించారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటారా..?

 

ఆయనే.. రాజు రవితేజ్.. ఈయన.. జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కూడా. అలాంటి రాజు రవితేజ్‌ పార్టీకీ గుడ్‌బై చెప్పారు. ఇకపై పవన్‌తో కానీ, జనసేన పార్టీతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని ఆయన ప్రకటించారు. తాను పార్టీ వీడేందుకు ఏర్పడిన పరిస్థితులను ఆయన వివరించారు. పవన్‌ ప్రవర్తన నచ్చకనే పార్టీని వీడుతున్నానని తెలిపారు.

 

అంతే కాదు.. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్‌.. ప్రస్తుతం కక్షసాధింపుతనం, కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారని రాజు రవితేజ అన్నారు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి పవన్ ను ఏమాత్రం అనుమతించకూడదు అంటున్నారు రాజు రవితేజ్. పవన్‌ కల్యాణ్‌ ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాడంటున్నారు.

 

పవన్‌ కల్యాణ్‌ సమాజానికి ప్రమాదమని రాజు రవితేజ్ ఆరోపిస్తున్నారు. అసులు జనసేన ఏర్పాటుకు పేరణ అని పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రవితేజ గురించి చెప్పేవారు. అలాంటి రాజు రవితేజ్ ఇప్పుడు ఆయనకు దూరం అవడం ఒకరకంగా జనసేన శ్రేణులకు షాకింగ్ న్యూస్ గానే చెప్పాలి. కేవలం పార్టీ నుంచి వెళ్లిపోవడమే కాకుండా.. రాజకీయ, సామాజిక అధికారం దక్కించుకోవడానికి పవన్‌ అనర్హుడని.. అసలు రాజకీయాలకు పనికిరాడని రాజు రవితేజ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి తప్పు ఎవరిది.. అసలేం జరిగిందన్నది తేలాల్సి ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: