ప్రేమను కాదన్నందుకు 27 డిసెంబరు 2007 న అయేషా కట్టుపోట్లకు గురైంది.  స్నానపుగదిలో కత్తిపోట్లతో నెత్తురోడుతున్న ఆయేషా నగ్న మృతదేహం వద్ద తన ప్రేమను కాదన్నందుకే ఆయేషాకి ఈ గతి పట్టించానని హంతకుడు ఒక లేఖ వదిలిన సంగతి తెలిసిందే. అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించినది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంకు చెందిన  శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ లో ఉంటూ, నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తున్న 19 ఏళ్ళ ఆయేషా మీరా బలాత్కరించబడి, హతమార్చబడినది. కాగా పన్నెండేళ్ల కిందట దారుణ హత్యాచారానికి గురైన ఆయేషా మీరా దేహానికి మరోసారి పోస్టుమార్టం చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది.కుటుంబ సభ్యులకు తెలపడంతో పాటు వారి సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించాలని పేర్కొంది. దీంతో శనివారం పోస్టుమార్టం చేసేందుకు సీబీఐ అధికారులు సన్నద్ధమవుతున్నారు. తెనాలి చెంచుపేటలోని ఈద్గాలో ఉన్న ఆయేషా సమాధిని తవ్వి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో డీఎన్‌ఏ నిర్ధారణతోపాటు, మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. విజయవాడలో 12 ఏళ్ల కిందట అత్యంత దారుణంగా లైంగికదాడికి, హత్యకు గురైన ఆయేషా మీరా కేసు మలుపులమీద మలుపులు తిరుగుతూవచ్చిన సంగతి తెలిసిందే. 


ఇప్పటివరకు ఏంజరిగిందంటే..
అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు మహిళా కోర్టుకు అందించిన ఆధారాల్లో చూపిన డీఎన్‌ఏ నిజంగా ఆయేషాదేనా అనే సందేహం సీబీఐకి రావటంతో కేసును మొదటి నుంచి తవ్వి తీసేందుకు రీపోస్టుమార్టం కోసం కోర్టును ఆశ్రయించారు. వారి అప్పీలుపై విచారణ జరిపిన విజయవాడలోని 4వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ నెల 7న అంగీకారం తెలిపింది. దీనిపై ఇప్పటి వరకు గోప్యత పాటించిన సీబీఐ అధికారులు తాజాగా ఆయేషా కేసు వాదిస్తున్న అడ్వొకేట్‌ శ్రీనివాస్‌ను, ఇతర శాఖల అధికారులను సంప్రదించడంతో విషయం బయటకు వచ్చింది. కోర్టు నుంచి, తల్లిదండ్రుల నుంచి అంగీకారం రావటంతో సీబీఐ విచారణను వేగం పెంచే అవకాశం ఏర్పడింది. రీపోస్టుమార్టం చేసేందుకు సీబీఐ అధికారులు తెనాలి చేరుకోనున్నారు.రెవెన్యూ అధికారుల సమక్షంలో వారి సహకారంతోనే పోస్టుమార్టం చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ నంతా వీడియోలో రికార్డు చేసి కోర్టుకు సమర్పించాల్సి ఉంది. 31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబును నిర్దోషిగా ప్రకటించినది. నిష్కారణంగా ఒక నిర్ధోషిని 8 ఏళ్ళు జైలులో ఉంచినందుకు పోలీసు యంత్రాంగానికి మొట్టికాయలు వేస్తూ లక్ష రూపాయలను నష్టపరిహారం విధించినది. ఆయేషాను సత్యంబాబే హత్య చేశారనేందుకు నిర్దిష్టమైన ఆధారాలను చూపడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు చేశారే తప్ప, అసలైన నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. పోలీసులు చెప్పిన సిద్ధాంతాన్నే కింది కోర్టు విశ్వసించిందని తెలిపింది. సత్యంబాబుపై ఉన్న కేసులను కోర్టులు కొట్టేసినప్పటికీ, అతన్ని పోలీసులు కరగడుగట్టిన నేరస్తుడిగా చిత్రీకరించారని పేర్కొంది. శక్తివంతమైన రాజకీయ కుటుంబాన్ని కాపాడేందుకు పోలీసులు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని సత్యంబాబు చెబుతున్న దానిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు తమ ముందున్న సాక్ష్యాలు సరిపోవడం లేదని తెలిపింది.


హైకోర్టు ఏంచెప్పిందంటే..
హైకోర్టు వెలువరించిన తీర్పుతో సత్యంబాబు స్వగ్రామమైన కృష్ణా జిల్లా నందిగామ పట్టణ శివారు అనాసాగరంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తన కుమారుడి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సామాన్యులకు సైతం న్యాయం జరుగుతుందని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్న విషయం రుజువైందని అతని తల్లి మరియమ్మ అన్నారు. రోజూ తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో అసలు దోషులెవరో తేల్చేందుకు కేసును పునర్విచారించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. తాజాగా సిబిఐ రంగంలోకి దిగింది. ఇప్పటికైనా ఈ కేసులో అసలు దోషులు బయటకి వస్తారని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: