వైసీపీ ముఖ్యనేత‌, ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌...రాజధాని అమరావతిపై ట్విస్టుల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా రాజధానిని మార్చే ఉద్దేశం ఉందా అని శాస‌న‌మండలిలో శుక్ర‌వారం అడిగిన ప్రశ్నకు లేదు అని ఆయ‌న‌ స‌మాధానం చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా త‌న స‌మాధానంపై తానే ట్విస్టు ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని మార్చాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని  కొత్త ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రీ అసెంబ్లీలో నిన్న ఇచ్చిన స‌మాధానం సంగ‌తేంట‌ని విలేక‌రుల స‌మావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణను ప్ర‌శ్నించ‌గా...శాస‌న‌మండ‌లిలో పరిస్థితిని బట్టి మాట్లాడానంటూ ముక్తాయించారు.

 

అమిత్‌షా నాకు ఫోన్ చేశాడు..నేనేమో ట్రంప్‌తో మీటింగ్‌లో ఉన్న‌..పాల్ సంచ‌ల‌నం

 

విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స స‌త్యానారాయ‌ణ రాజ‌ధానిపై మ‌రింత ఉత్కంఠ‌ను పెంచారు. రాజ‌ధానిని మార్చుతారా? అనే ప్ర‌శ్న‌ను స‌భ్యులు వేశార‌ని...తాను స‌మాధానం చెప్పే నాటికి రాజధానిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనందున తాను ‘‘లేదు ‘‘ అన్న సమాధానం చెప్పానని బొత్స వెల్ల‌డించారు. ఆ ప్ర‌శ్న‌కు అనుబంధ ప్రశ్న వేసి ఉంటే మరింత క్లారిటీ ఇచ్చేవాడినని చెప్తూ... రాజ‌ధాని గురించి బొత్స మ‌రింత క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేశారు. ఇంత‌కీ రాజ‌ధానిపై ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏంట‌ని మీడియా స‌హ‌జ‌మైన ఉత్సుక‌త‌తో ప్ర‌శ్నిస్తే...బొత్స ఇచ్చిన స‌మాధానం...అమరావతి, రాజధాని నిర్మాణం, సంబంధిత అంశాల పరిశీలనకు నియమించిన టెక్నికల్ కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్ర‌క‌టించారు. 

 

ఎర్ర‌గ‌డ్డ మెంట‌ల్ ఆస్ప‌త్రిలో...మంత్రి ఈటల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

 

స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌, అనుబంధ ప్ర‌శ్న విష‌యంలోనే స్ప‌ష్ట‌త లోపించింద‌ని...త‌న స‌మాధానంలో క్లారిటీ ఉంద‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ వ్యాఖ్యానించారు. అనుబంధ ప్రశ్నలు వేసి వుంటే.. రాజధాని విషయంలో నియమించిన కమిటీ ప్రస్తావన వచ్చి ఉండేదని, దాంతో తన ప్రకటనపై మరింత క్లారిటీ వచ్చేదని బొత్స విశ్లేషించారు. అంటే...తాను చెప్పిన స‌మధానం స‌రైన‌దేన‌ని...స‌భ్యులు ప్ర‌శ్న అడిగిన తీరే స‌రైంది కాద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇదిలాఉండ‌గా...మంత్రి బొత్స స‌మాధానంతో...రాజధాని మార్చే అంశం ఇంకా ముఖ్యమంత్రి జగన్ పరిశీలనలో ఉందా అనే కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: