జనసేన ప్రధాన కార్యదర్శి రాజు రవితేజ రాజీనామా వెనుక అసలు కారణం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది . పవన్ వైఖరి నచ్చకనే అయన పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ , అసలు కారణం వేరే ఉండి ఉంటుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది  . పవన్ ఇటీవల చేసిన మతపరమైన  వ్యాఖ్యలకు నొచ్చుకున్న రాజు రవితేజ, పార్టీ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది . జనసేన  కుల , మతాలకతీతంగా  సెక్యులర్ భావజాలంతో ఆవిర్భవించిన పార్టీ గా పవన్ ప్రచారం చేసుకున్న విషయం తెల్సిందే.

 

అయితే ఇటీవల ఉన్నట్టుండి తిరుపతిలో అన్యమత ప్రచారం పై , కృష్ణా పుష్కరాల్లో బాప్టిజం కు వ్యతిరేకంగా అయన  చేసిన వ్యాఖ్యలకు, క్రైస్తవ మతస్థుడైన  రాజు రవితేజ నొచ్చుకుని పార్టీ కి రాజీనామా చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది . అయితే రాజు రవితేజ స్వయంగా తనకు తానే ఈ నిర్ణయం తీసుకున్నారా ?, లేకపోతే ఆయనపై  క్రిస్టియన్ మిషనరీల ప్రభావం ఏమైనా ఉందా? అన్నది చర్చనీయాంశంగా మారింది . తిరుమల లో అన్యమత ప్రచారం జరుగుతోందన్నది జగమెరిగిన సత్యమే , ఈ విషయాన్నే పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు . పవన్ చేసిన వ్యాఖ్యలు సహాజంగానే   క్రిస్టియన్ మిషనరీలు రుచించే అవకాశం లేదు .

 

దాంతో మిషనరీలు , పవన్ నోరు మూయించేందుకే ఈ ఎత్తుగడ వేసి ఉంటాయన్న వాదనలు లేకపోలేదు . ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై జనసేనాని అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా , ఆ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీ లో సమర్ధించి ఆయనకు షాక్ ఇవ్వగా , ఇప్పుడు అన్యమత ప్రచారానికి వ్యతిరేకంగా పవన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూనే రాజు రవితేజ పార్టీ కి రాజీనామా చేసి , ఆయన పై ఫైర్ అవుతున్నారన్న ఊహాగానాలు   పొలిటికల్ సర్కిల్స్ లో విన్పిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: