రాయలసీమ అంశం మళ్ళీ తెరపైకి వస్తుంది. క్రమంగా ఈ అంశంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. రాయలసీమ సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సీమ అభివృద్ధికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకటించాలని రాయలసీమ స్టూడెంట్ యూనియన్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఆకుమళ్ల శ్రీధర్ డిమాండ్ చేశారు. స్థానిక కర్నూలు నగరంలోని బి క్యాంప్ బిసి కళాశాల స్థాయి బాలుర వసతి గృహం నందు "సీమ సమస్యలు పరిష్కారం - అభివృద్ధి" అనే అంశం పై  సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుమళ్ల శ్రీధర్ మాట్లాడుతూ గత ఏడూ దశాబ్దాలుగా రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురైతుందని, నాగార్జునసాగర్,  ప్రకాశం బ్యారేజీ,  కాటన్ బ్యారేజీ,  పులిచింతల, పట్టిసీమ అన్ని ప్రాజెక్టులు కోస్తా ప్రాంతంలోనే కట్టారని ఇప్పుడు కడుతున్న పోలవరం, తాత్కాలిక రాజధాని  అమరావతి కోస్తాలోనే ఉన్నాయని, రాయలసీమలో కేవలం శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కోస్తావారే వినియోగించు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సిద్దేశ్వరం, వేదవతి, గుండ్రేవుల, ఆర్డిఎస్,  పులికనుమ, తుంగభద్ర సమాంతర కాలువ తదితర ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలని, రాయలసీమలో ప్రత్యేక వైద్య విశ్వవిద్యాలయం నెలకొల్పాలని, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ఎయిమ్స్ స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని,  నూతనంగా ఏపీలో ఏర్పాటు కాబోయే ఎనిమిది మెడికల్ కాలేజీలలో రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయాలని, సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి 500 కోట్ల నిధులు కేటాయించి టీచింగ్ నాన్ టీచింగ్  పోస్టులు శాశ్వత పద్ధతిలో రాయలసీమ వారితోనే చేపట్టాలని డిమాండ్ చేశారు.


నూతన కర్నూలు నగర  కమిటీ ఎన్నిక.. 
సదస్సు అనంతరం నూతన నగర కమిటీని ఎంపిక చేశారు. నగర అధ్యక్షులుగా బండి పరశురాం, నగర ప్రధాన కార్యదర్శి వి.కార్తీక్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల శ్రీధర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: