ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది . మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే విధంగా జగన్ సర్కార్ ఇటీవ దిశ చట్టం తీసుకువచ్చిన విషయం తెల్సిందే . దిశ చట్టం లో భాగంగా ఇండియన్ పీనల్ కోడ్ , పోస్కో యాక్ట్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసిజర్ కు రాష్ట్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది . దేశ వ్యాప్తంగా ఇదే తరహా లో సవరణలు చేసి , దిశ చట్టాన్ని అమలు చేయాలన్న డిమాండ్ మహిళాసంఘాల ప్రతినిధుల నుంచి  అంతకంతకు పెరుగుతోంది .

 

ఈ మేరకు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మాలివాల్, ప్రధాని మోడీకి లేఖ రాశారు . మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని  గత 12  రోజులుగా స్వాతి మాలివాల్ డిమాండ్ చేస్తూ, దీక్ష చేస్తున్నారు . దిశ చట్టం ప్రకారం అత్యాచార నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోనున్నారు .  అన్ని ఆధారాలుంటే 14  రోజుల్లోనే నిందితులకు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోనున్నట్లు చట్టం లో పేర్కొన్నారు . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం,  మహిళల భధ్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టంపై రాష్ట్రంలోని మహిళా ఉద్యోగినులు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారు .

 

ఈ చట్టం వల్ల నేరాలకు పాల్పడాలనుకునేవారిలో వణుకు పుడుతుందని  ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ మహిళా ఉద్యోగినులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు . లైంగిక దాడికి గురయిన మహిళలు , బాలికలకు సత్వర న్యాయం చేయాలన్న సంకల్పం తో రాష్ట్ర ప్రభుత్వం , దిశ  చట్టాన్ని తీసుకురావడం అభినందనీయమని వారు అంటున్నారు . ఈ చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని , అన్ని రాష్ట్రాలు మహిళా భద్రతా కోసం మెరుగైన చట్టాలను తీసుకురావాలని కోరుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: