ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండోసారి జరిపిన అనధికారిక చర్చల ఫలితాలు క్రమంగా కనిపిస్తున్నాయని చైనా రాయబారి సున్ వీడోంగ్ అన్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతల కోసం భారత దేశంతో రక్షణ, భద్రత సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించామన్నారు.
 
మోదీ-జిన్‌పింగ్ నిర్ణయాలకు అనుగుణంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను పెంచేందుకు ఆర్థిక, వాణిజ్య రంగాల్లో అత్యున్నత స్థాయి చర్చల యంత్రాంగాలను ఏర్పాటు చేయడానికి కృషి జరుగుతున్నట్లు తెలిపారు.
 
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంపై భారత దేశం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. భారత దేశం లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం సంబంధితులందరితోనూ కలిసి పని చేస్తామన్నారు.
 
కశ్మీరు అంశంపై తమ వైఖరి నిలకడగా, స్పష్టంగా ఉందన్నారు. ప్రశాంతమైన, స్థిరమైన వాతావరణం లేకపోతే అభివృద్ధి అనేదే ఉండదన్నారు.

అక్టోబర్ లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని నేపాల్ బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీతో అనధికారిక సమావేశం నిర్వహించారు. ఇందుకు వేదికగా కోవలంలోని ఫిషర్‌మెన్ కోవ్ రిసార్ట్ వేదికగా నిలిచింది. శనివారం ఉదయం 10 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఆ తర్వాత రెండు దేశాధినేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. 

యూనెస్కో మహాబలిపురం ఆలయంను వారసత్వ సంపదగా గుర్తించిందని మోడీ తెలిపారు. ఇరు దేశాధినేతలు ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. అనంతరం ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత తమిళ రుచులతో కూడిన భోజనం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విందులో ఏర్పాటు చేశారు. ఇక శనివారం అక్టోబర్ 12న ఇరు దేశాధినేతలు అనధికారిక ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

మోదీ-జిన్‌పింగ్ అక్టోబరులో మహాబలిపురంలో అనధికారిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మోదీ తమిళ సంప్రదాయ దుస్తులను ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇరువురు నేతలు గత ఏడాది ఏప్రిల్‌లో చైనాలోని వూహన్‌లో మొదటిసారి అనధికారిక చర్చలు జరిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: