పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హస్తిన లో ఆందోళన చేపట్టిన జామియా మిలియా ఇస్లామిక్ యూనివర్సిటీ  విద్యార్థులకు సంఘీభావాన్ని తెలుపుతూ , హైదరాబాద్ లోని మౌలానా నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు . యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు బైఠాయించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు . ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయం లోని  స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కార్యకర్తలు  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేసి తన నిరసన ను వ్యక్తం చేశారు .

 

 పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో స్థానికులతో కలిసి ,  జామియా మిలియా ఇస్లామిక్ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి, తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది  . జామియా నగర్ లో  ఆందోళనకారులు చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ , బాష్పవాయు గోళాలను ప్రయోగించారు . దీనితో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కు చెందిన నాలుగు బస్సులకు నిప్పు పెట్టడమే కాకుండా, ఒక అగ్నిమాపక వాహనాన్ని దగ్ధం చేశారు . పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జామియా నగర్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి , మెట్రో స్టేషన్లను మూసి వేయడమే కాకుండా , ట్రాఫిక్ ను ఇతర ప్రాంతాలకు మళ్లించారు .

 

ఢిల్లీ లో  జామియా మిలియా ఇస్లామిక్ యూనివర్సిటీ  లాఠీఛార్జ్ వార్త తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ లోని అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా నిరసనలకు దిగారు . విద్యార్థుల ఆందోళనల నేపధ్యం లో యూనివర్సిటీని జనవరి ఐదవ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు . విశ్వ విద్యాలయాల్లో చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యం లో  పౌరసత్వ  సవరణ చట్టం పై దేశ ప్రజలకు అవగాహనా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని బీజేపీ నేతలు ప్రకటించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: