ఎన్‌ఆర్‌సీ అంటే ఏమిటో మీకు తెలుసా...జాతీయ స్థాయిలో అర్హులైన పౌరుల  అందరితో కలిసి ఉన్న  జాబితాను నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ అని అంటారు. ఇటీవలే  సుప్రీంకోర్టు ఆదేశాల జారీ చేయడంతో అక్రమ వలసదారులను బయటకి తీసేయందుకు ఈ ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పూర్తి చేయడం జరిగింది. ఎందుకు అస్సాంలో  చేపట్టారు అని అనుకుంటున్నారా..ప్రత్యేక జాతులపై ప్రభావం పడుతుంది అనే ఉద్దేశంతో  చేపట్టడం జరిగింది.

 


కానీ  అస్సాంలో  ఎన్‌ఆర్‌సీ ముగిసినప్పటికీ కూడా  జాతీయ స్థాయిలో అమలుకు డిమాండ్లు బాగా పెరిగి పోతూన్నాయి.  ఇందుకు హోం మంత్రి అమిత్‌ షాతోపాటు బీజేపీ అగ్రనేతలు కొందరు బదులు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఓ చట్టం చేసేందుకు  బాగా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంచనా వేయడం జరిగింది. ఒక వేళా ఎన్‌ఆర్‌సీ చట్టం దేశం అంతటా అమల్లోకి వస్తే మాత్రం ప్రభుత్వం ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉన్న వారిని  గుర్తించడంతో పాటు అదుపులోకి తీసుకునేందుకు అవకాశాలు చాల ఉన్నాయి.

 


ఈ  ఎన్‌ఆర్‌సీ చట్టం అమలు లోకి వస్తే నష్టం ఎవరికి అన్న విషయానికి వస్తే.. అక్రమ వలసదారులే లక్ష్యంగా మారడం జరుగుతుంది. వాస్తవానికి ఎన్‌ఆర్‌సీ చట్టం అనేది ఓ ప్రతిపాదన మాత్రమే ఐతే  అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్, పార్శీలకు ఇబ్బందులు ఉండవు. ఓకే వేళాఎన్‌ఆర్‌సీ  దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పైన చెప్పుకున్న మూడు దేశాలు మినహా మిగిలిన ఏ దేశపు అక్రమ వలసదారు కూడా ఇక్కడ ఉండేందుకు అవకాశాలు చాల తగువే అని చెప్పాలి. ఇక ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలూ చాలా ఇబ్బందులు ఎదురు కుంటారు.

 

ఎందుకంటే ముస్లింలూ  ఇబ్బందులు వస్తాయి అంటే  వీరు పౌరసత్వ చట్ట సవరణ నిబంధనల్లో లేరు కనుక. దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని డిటెన్షన్‌ కేంద్రాలకు పంపించ వలసిన అవసరం  వస్తుంది. ఇప్పటికే  అస్సాంలో కనిపెట్టగా 19 లక్షల మంది అక్రమ వలసదారులను ఇలాగే డిటెన్షన్‌ కేంద్రాల్లోనే ఉంచడం జరిగింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: