రాష్ట్రంలో అదికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. రెడ్డి రాజ్యం నిర్మించిందా?  సీఎం జ‌గ‌న్ ఎంత కాద‌ని చెబుతున్నా .. కీల‌క ప‌ద‌వుల్లో రెడ్ల‌కే ప్రాదాన్యం ఇస్తున్నారా?  వారికే అధిక సంఖ్య‌లో ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారా?  అం టే.. తాజా ప‌రిణామాల‌పై ప్ర‌భుత్వ వ్య‌తిరేక మీడియా పెద్ద ఎత్తున క‌థ‌నాలు రాస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు త‌న సొంత సామాజిక వ‌ర్గానికి ప‌ద‌వులు ఇచ్చేందుకు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుని అడుగులు ముందుకు వేసేవార‌ని, కానీ, జ‌గ‌న్ మాత్రం త‌న సొంత సామాజిక వ‌ర్గం స‌హా, త‌న సొంత మీడియాలోని కొంద‌రికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి.. ప్ర‌భుత్వాన్ని రెడ్డి రాజ్యంగా మారుస్తున్నార‌ని స‌ద‌రు మీడియా విమ‌ర్శ‌లు చేస్తోంది.

 

నిజానికి రాష్ట్ర ప్ర‌భుత్వంలోని మంత్రుల ప‌ద‌వులు గ‌మ‌నిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు వారి వారి సంఖ్యాబ‌లాన్నిమించి జ‌గ‌న్ ప‌ద‌వులు అప్ప‌గించార‌నేది వాస్త‌వం. అయితే, ప్ర‌భుత్వానికి ఉన్న వెసు లుబాటు ప్ర‌కారం.. నామినేటెడ్ ప‌ద‌వుల్లో మాత్రం త‌న‌కు న‌చ్చిన‌వారికి ఇచ్చుకున్నారు. వీరిలోనే ఇప్పు డు రెడ్డి వ‌ర్గం ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. అయితే, నిజానికి వీరికి ప్ర‌జ‌ల‌తో ప్ర‌త్య‌క్ష సంబందాలు ఉండ‌వు. ప్ర‌భుత్వం స్వ‌యంగా అసెంబ్లీలోనే వెల్ల‌డించిన‌ట్టు.. ఈ ప‌ద‌వుల్లో ఉన్న‌వారు రెండేళ్ల వ‌ర‌కే ప‌రిమితం. అయినా కూడా విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు.

 

ఇదెలా ఉన్న‌ప్ప‌టికీ.. ఒక‌టి మాత్రం వాస్త‌వం.. జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం వెనుక రెడ్డి వ‌ర్గం కృషి చాలా నే ఉంది. గ‌తంలో టీడీపీ ఉండి, ఎమ్మెల్యేగా ఉన్న స‌మయంలోనే మోదుగుల వేణుగోపాల రెడ్డి వంటివా రు.. రెడ్డి వ‌ర్గం అధికారంలోకి వ‌స్తేనే మ‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించిన సంద‌ర్భం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. అంటే, చంద్ర‌బాబు పాల‌న‌లో ప్ర‌త్యేకంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఆయ‌న ఏమీ చేయ‌లేక పోయార‌నే అసంతృప్తి గూడుక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకు వీరు ఎంతో సాయం చేశారు.

 

ఇప్పుడు ఈ వ‌ర్గానికి జ‌గ‌న్ కొమ్ముకాయ‌క పోతే.. మ‌ళ్లీ బాబు ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అనేవారూ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ప‌ద‌వులు కాక‌పోయినా.. నామినేటెడ్ ప‌ద‌వులు ఇచ్చార‌నే వాద‌న వినిపిస్తోంది. ఏ ప్ర‌భుత్వానికైనా స్వేచ్ఛ ఉన్న‌ట్టే.. జ‌గ‌న్ కూడా ఈ స్వేచ్ఛ‌ను వినియోగించుకుంటున్నార‌ని అంటున్నారు. ఎవ‌రు ఏమ‌న్నా.. ఇప్ప‌టికిప్పుడు ఈ ప‌రిస్థితి మారేది కాదు!!

మరింత సమాచారం తెలుసుకోండి: