ఏపీ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది.అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలలో చాలా యక్టివ్ గా ఉంటారు. కొందరైతే సాయిరెడ్డి ని ట్విట్టర్ స్టార్ అనికూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన మీడియాలో కంటే సోషల్ మీడియాలోనే..అందులోనూ ట్విట్టర్ లోనే ఎక్కువ మాట్లాడుతారు.

 

అలాంటి  విజయసాయి రెడ్డికి  తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్టణం కంబాల కోటలో పలువురు ‘కాపుల ఆత్మీయ కలయిక’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాని కి మంత్రి అవంతి శ్రీనివాస్‌ తో పాటు విజయసాయి రెడ్డి పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ని చూసిన కొందరు .కాపుల సభలో రెడ్లు ఎలా వస్తారంటూ... జై కాపు.. జై జై కాపు అంటూ నినాదాలు చేసి గందరగోళం సృష్టించారు.. కాపు మహా సభలకు వైసీపీ నేతలను ఎలా తీసుకువస్తారని? ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు."నేను కూడా కాపునే నా పదోవ తరగతి సర్టిఫికెట్లలో నేను కాపు అనిరాసివుంటుందని అన్నారు.. చనిపోయే ముందు నా డెత్‌ సర్టిఫికేట్‌లో కాపు అని రాసి ఉంటుందని చెప్పారు". ఇక  విజయ సాయిరెడ్డి సమక్షంలో కొందరు ఆందోళన చేసినవారిపై    మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు..మంత్రి జోక్యం చేసుకుంటూ.. విశాఖ నుంచి 11 మంది ఎమ్మెల్యే లు గెలిచినప్పటికి తాను ఒక్కడినే మంత్రిగా అయ్యానని అన్నారు.ఏలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మంత్రి అయ్యానని అన్నారు.తాను మంత్రి అయినందు వల్లే సహనంగా ఉన్నానన్నారు. ఈలోపు కొందరు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడగా.. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం జోక్యం కాదని అవంతి సందరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దాంతో సభ రసభసంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: