రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే టీడీపీ నేతలకు ఎందుకు కడుపు మండుతోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేదానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మద్యపానం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీడీపీకి లేదు అని ఆయన ధ్వజమెత్తారు.

 

 ఎన్టీఆర్ మద్యపాన నిషేదాన్ని పూర్తిగా అమలు చేసే సమయంలో చంద్రబాబు ఓట్ల కోసం ఎన్టీఆర్‌ ఏమి చెప్పారో మేనిఫెస్టోలో పెడుతున్నానని, మద్యపాన నిషేదం చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయనను నమ్మి ఓట్లు వేసిన వారికి ద్రోహం చేశారు అని గుర్తు చేసారు. 

 

 మహిళల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన మా జననేత వైయస్‌ జగన్‌ మహిళలకు ఇచ్చిన కానుక మద్యం మాన్పించు అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నారు. బాగా బాటిల్స్‌ సఫ్లయ్‌ చేయాలా? మీ ఆలోచన ఏంటి?. గతంలో మద్యం ఏరులు పారింది. ప్రైవేట్‌ వ్యాపారులు ఇష్టరాజ్యాంగా దోచుకున్నారు. టీడీపీ నేతల కడుపు మంట ఏంటో అర్థం కావడం లేదు. టీడీపీ నేతలకు సూటీగా ప్రశ్నిస్తున్నాను. మద్యపానాన్ని అమలు చేయాలా? వద్దా సమాధానం చెప్పమనండి. మద్యపానం దశలవారీగా నిషేదిస్తున్నాం. ఇప్పటికీ 20 శాతం షాపులు తగ్గించాం. గతంలో 4380 షాపులు ఉండగా దాన్ని తగ్గిస్తూ 3420 షాపులు మాత్రమే ఏర్పాటు చేశాం. 

 

వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక మద్యపాన నిషేదాన్ని దశల వారిగా అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. టీడీపీ వాళ్లు కూడా ముందుకు రాకపోయి ఉంటే 70 శాతం మద్యపాన నిషేదం అమలు అయ్యేది. ఒకేసారి మద్యపానం నిషేదం చేయడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడంతో దశల వారిగా అమలు చేస్తున్నాం అని చెప్పారు. గతంలో అన్ని కూడా టీడీపీ మద్దతుదారులకే మద్యం షాపులు ఇచ్చారు. ఎవరు దరఖాస్తు చేసుకున్నా టెండర్‌ ద్వారా ఇస్తామని ఆ రోజు ప్రకటించాం.  రాష్ట్రంలో 80 శాతం షాపులు టీడీపీ నేతలవే ఉన్నాయి. షాపుల అద్దెలపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తాం. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు గతంలో షాపులు నిర్వహించారు. మేం అధికారంలోకి వచ్చాక అది ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలకే షాపులు మూసివేస్తున్నామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: