మద్యపాన నిషేధంపై మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ వారికి లేదు. ఎన్టీరామారావు గారు పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేస్తే చంద్రబాబు దాన్ని ఎత్తేశారు. చంద్రబాబు పాలసీ మద్యం తాగు, తాగుపించు అని ఏపీ రాష్ట్ర  ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కె నారాయణస్వామి విమర్శించారు. మంగళవారం మంత్రి మద్య నిషేధం, మద్యం అమ్మకాలు, షాపుల అద్దెల పై మాట్లాడారు. మద్యపానాన్ని నిషేధించాలన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  లక్ష్యానికి అనుగుణంగా టెండర్లు దాఖలు కాలేదన్నారు. టెండర్లలో 80 శాతం టిడిపి వాళ్లవేనన్నారు. ఈ టెండర్లను  వైయస్సార్‌ పార్టీ వాళ్లు  వేయలేదని చెప్పారు.  
మద్యపాన నిషేధంపై మాట్లాడే నైతిక హక్కు (టిడిపి) వారికి లేదు, కారణం 
ఎన్టీరామారావు గారు పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేసేటప్పుడు, చంద్రబాబు దాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. గౌరవ సభ్యురాలు ప్రశ్న అడిగారు. బాగా బాటిల్స్‌ సరఫరా చేయడం లేదు. టీడీపీ హయాంలో మద్యం ఏరులుగా పారించారు. ప్రైవేటు వ్యాపారస్ధుల చేతికిచ్చారన్నారు. ఈ మూడు నెలల్లో మద్యం వినియోగం తగ్గింది. ఏఫ్రెల్‌లో 48.33 శాతం తగ్గింది. ఇది క్రమేపీ తగ్గుతూ  ఆగష్టులో మైనస్‌ 2.5 శాతం తగ్గింది.  మద్యపాన నిషేధాన్ని అమలు చేయాల్నా వద్దా అని అచ్చన్నాయుడుని సూటిగా ప్రశ్నించారు. మద్యపానాన్ని దశలవారీగా తగ్గించాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే అయన అధికారంలోకి వచ్చిన తర్వాత  20శాతం షాపులు తగ్గించారని చెప్పారు.

గతంలో 4380 షాపులు ఉండగా... దాన్ని 20శాతం తగ్గిస్తూ 3500 షాపులకు కుదించారన్నారు. షాపులు రెంట్స్‌ గురించి మాట్లాడుతున్నారు. ఇది నామినేషన్‌ పై ఇచ్చినది కాదు. ఒక ఐఏఎస్‌ ఆధికారిని, జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన జరిగినట్టు చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆరుగురు ఉద్యోగులను ఆ కమిటీలో వేశామన్నారు. టెండరు రూపంలో రూంలు అద్దెకు తీసుకున్నారు. ఏపిఎస్‌బిసిఎల్‌ ద్వారా అమ్మకాలు చేపడుతున్నాం. మద్యపానాన్ని నిషేధించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా , ఒక సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకురావాలని వైయస్సార్‌ పార్టీ వాళ్లు ఎవరూ కూడా టెండర్లు ఏసేదానికి ముందుకు రాలేదని స్పష్టం చేశారు. దాదాపు 80 శాతం తెలుగుదేశం వాళ్లే టెండర్లు వేశారు. విశాఖపట్నంలో టిడిపి మద్ధతుదారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాపులు అద్దెకు తీసుకున్న వారు. విశాఖపట్నంలో జనప్రియ గ్రూప్,  కే వి ఆర్‌ ప్రసాద్‌ టిడిపి మద్ధతుదారుడు వారి ద్వారానే కేటాయించడమైందన్నారు.

చంద్రబాబు అయినా, వారి కుమారుడు లోకేష్‌ అయినా ఆన్‌ లైన్లో దరఖాస్తు చేసుకుంటే మద్యం విక్రయానికి లాటరీ సిస్ధంలో మీక్కూడా షాపులు ఇస్తారని చెప్పాను. దీనికి నేను 80 శాతం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లకి ఇస్తానన్నానని కోర్టులో  కూడా నా పై పిటీషన్ వేశారు. వాస్తవానికి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు ముందుకు రావడం లేదు. మొత్తం మీరే అమ్ముతున్నారు. అదే మా ఖర్మ అని మంత్రి వ్యాఖ్యానించారు. షాపుల నిర్వహణ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చే  దుస్ధితి పట్టలేదుడీ కిషోర్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సొంతమనిషి సవేరా కాంతారావు టిడిపి  మనిషి అని సభాముఖంగా వివరించారు. షాపులు ఉదయం 11 గంటల నుంచి 8 గంటలు వరకు మాత్రమే అని మేం చెప్పాం. షాపులు పై కూడా రివర్స్‌ టెండరింగ్‌ కు వెళదామని చెపుతున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: