ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను గత బుధువారం ముందుకు తీసుకెళ్లింది. గత బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రవాణా, రోడ్లు, రహదారులు, భవనాలశాఖలోనే ఈ విభాగం ఏర్పాటు చేయనున్నారు. 

                                          

అయితే ఏపీఎస్‌ ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగినట్లుగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవల కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. 

                                                   

ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు ఇదివరకే ఇనిషియేట్ చేసిన ఏపీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియలో కీలక ఘట్టం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న ఎన్నికల హామీని సీఎం జగన్ నెరవేర్చేశారు. ఈ ప్రక్రియకు ఇదివరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా, సోమవారం శాసనసభలో ఆర్టీసీ విలీనంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. అనంతరం విలీనం బిల్లును రవాణా శాఖా మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: