తెలంగాణ  రాష్ట్ర  సమితి (టీఆరెస్) లో అప్పుడే రాజ్యసభ స్థానాలను కోసం పోటీ ప్రారంభమయింది . వచ్చే ఏడాది రెండు రాజ్యసభ స్థానాలకు ఖాళీ కానున్నాయి .ఈ రెండు స్థానాల కోసం పార్టీ లో పలువురు పోటీ పడుతున్నారు . సామాజిక సమీకరణాల ఆధారంగా ఒక స్థానాన్ని అగ్ర వర్గాలకు , మరొకటి బిసిలకు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది . బిసి కోటా లో మరోసారి  పార్టీ సెక్రటరీ జెనరల్  కేశవరావు కు రాజ్యసభ పదవి కేటాయించే అవకాశాలున్నాయని సమాచారం .

 

కేశవరావు  రాజ్యసభ పదవి కాలం వచ్చే ఏడాది  పూర్తి కానుండడం తో ఆయనకు తిరిగి కేసీఆర్ రెన్యూవల్ చేస్తారా ? లేదా ??  అన్నది ఇప్పుడు  హాట్ టాఫిక్ గా మారింది . కేశవరావు కు తిరిగి రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తే , రెండవ స్థానాన్ని ఎవరికీ కట్టబెడుతారన్నది   పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది . రాజ్యసభ స్థానం కోసం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ , నిజామాబాద్ మాజీ ఎంపీ , కేసీఆర్ కుమార్తె కవితలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది .  ఢిల్లీలో జాతీయ నేతలతో  విస్తృత పరిచయాలు ఉన్న వినోద్ కు రాజ్యసభ పదవి కట్టబెట్టి ,  ఆయన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  హస్తిన లో ఉంచాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది .

 

అదే నిజమైతే కవిత కు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలు ఎంతమాత్రం లేవన్నది స్పష్టం అవుతోంది . రాజ్యసభ స్థానాన్ని కవితకు కట్టబెడితే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉండడం తో ,  వినోద్ కు ఇవ్వడమే  బెటరన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. గతంలో కేసీఆర్ తన మరదలి కుమారుడు సంతోష్ రావు కు రాజ్యసభ స్థానాన్ని కేటాయించడం పట్ల తీవ్ర విమర్శలు వెళ్లువెత్తిన విషయం తెల్సిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: