తెలుగు రాష్ట్రలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటయ్యా అంటే ఠక్కున వచ్చే సమాధానం లిక్కర్. మద్యం ప్రభావాన్ని తగ్గించాలన్న మహోన్నతాశయంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సంచలనాలను సృష్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ డిసెంబర్ 17 వ తేదీ నుంచి మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు.  ముందు రోజు రాత్రి ఎక్కడ చూసినా రేవు పార్టీలెక్క ఈ సర్కార్ పార్టీలు జరిగాయి. ఇప్పటికే రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మద్య నియంత్రణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్.

జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలన్నారు. బార్లకు అనుమతిఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆమేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆదేశించారు. మద్య నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని సీఎం చెప్పారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరుకే మాత్రమే బార్లలో మద్యం అమ్మకాలు సాగించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: