ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి దాదాపుగా 53 రోజులపాటు సమ్మె చేశారు.  సమ్మె చేసినా ఉపయోగం లేదు.  ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా 26 డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచారు.  కానీ, ఒక్క డిమాండ్ ను కూడా ప్రభుత్వం ఆమోదించలేదు.  పైగా సమ్మె చేస్తున్నారని చెప్పి వారిని తొలగించాలని అనుకుంది.  5100 రూట్లలో ప్రైవేట్ బస్సులను నడపాలని కూడా అనుకుంది.  కానీ, విచారకు దానిని విరమించుకుంది.  


విరమించుకొని తిరిగి కార్మికులను విధుల్లోకి తీసుకుంది. అనంతరం కార్మికులతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు కెసిఆర్.  అనేక వరాలు ఇచ్చారు.  ఆర్టీసీ కోసం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.  రిటైర్మెంట్ వయసును 60 సంవత్సరాలకు పెంచారు. మహిళలకు సంబంధించిన విధులను రాత్రి 8 వరకు పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు.  అదే విధంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలని,  బోనస్ అందుకునేలా చేయాలని కెసిఆర్ పేర్కొన్నారు.  


అయితే, ఆర్టీసీ కార్మికులకు కెసిఆర్ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చారు.  ఇప్పటి వరకు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళను ఆర్టీసీ కార్మికులుగా పిలిచేవారు.  ఇకవై వారిని అలా కాకుండా ఉద్యోగులుగా పిలుస్తూ సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం.  ఇకపై వారిని ఉద్యోగులుగా పిలుస్తారు.  ఇకపై వాళ్ళు కార్మికులు కారన్నమాట.  వారంతా కూడా ఉద్యోగులే.  ఇది ఆర్టీసీ ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి.  


ఇక ఇదిలా ఉంటె, ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.  నిన్నటి రోజున దీనికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.  దీంతో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.  దీంతో బిల్లు చట్టం దాల్చింది.  నిన్నటి నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు.  ఆర్టీసీకి ఉద్యోగులకు అయ్యే జీతభత్యాలను ప్రభుత్వమే భరిస్తుంది.   ఏటా ఇందుకోసం రూ. 3600 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: