ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమత్రిగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేప్పట్టిన తర్వాత ప్రజలకు మంచి చేయాలనీ తపిస్తూ ఉన్నాడు. ఇకపోతే రైతులకు సబ్సిడీతో పాటుగా, రైతు భరోసా కూడా కల్పించింది ముందస్తూ సాయాన్ని అందిస్తూ  వస్తున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజలను సొంత కుటుంబ సభ్యులు భావించిన జగన్ ఏదొక కొత్త పథకాలను చేస్తూ వస్తున్నారు. 

 

మహిళలకు డ్వాక్రా రుణాలు అందిస్తూ  వారికి చేతి సాయంగా రుణాలు కూడా అందిస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కూడా గడవక ముందే ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకొస్తున్నారు.  ఇక వృద్ధాప్య పింఛన్ కూడా ప్రజలకు అందేలా జగన్ చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ పార్టీకి జనాలు జేజేలు పలుకుతున్నారని వేరేలా చెప్పనక్కర్లేదు

 


ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులకు చక్కటి శుభవార్తను అందించారు. ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ సర్కార్ తీపి కబురు అందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు అసెంబ్లీలో గ్రీన్ సిగ్నల్ లభించింది. మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల తరహాలోనే ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈ విదంగా చేయడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులు మరింతగా అప్రజలకు సేవలు అందించడంలో  ముంటుంటారని జగన్ తెలిపారు. ఈ పథకం 2020 వ సంవత్సరం ప్రథమార్థంలో అమల్లోకి రానుంది.. 

 


దీంతో జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణా శాఖలో భాగం కానున్నారన్నారు. ఈ బిల్లుకు తమ హయాంలో ఆమోదం లభించడంపై సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయసు కూడా 60 ఏళ్లకు ప్రకటించారు. గత ప్రభుత్వాలు చేయలేని దానిని తాము చేసిచూపించామని జగన్ పేర్కొన్నారు. మరిన్ని పథకాలను అమలు చేయాలనీ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: