గడచిన పదేళ్లలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కార్పొరేట్ పార్టీగా మార్చేశారనే విమర్శలు ప్రజల నుండి, రాజకీయ నాయకుల నుండి వ్యక్తమయ్యాయి. సీనియర్ ఎన్టీయార్ హయాంలో తెలుగుదేశం పార్టీలో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పని చేస్తారో, ఎవరైతే ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తారో వారికి మాత్రమే పదవులు దక్కేవి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసిన వారి కంటే ధన బలం ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చారని టికెట్లను, పదవులను డబ్బులకు అమ్ముకున్నారని రాజకీయ నేతల నుండి, ప్రజల నుండి విమర్శలు వ్యక్తమయ్యాయి. 
 
తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు ఆర్థిక నేరగాళ్లను, మనీ లాండరింగ్ నిపుణులను పంపడం మాత్రమే కాకుండా వారిని కేంద్ర మంత్రులుగా నియమించింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీట్లను అమ్ముకుంటుందన్న విషయం ఆ పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసని గతంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు బహిరంగంగా విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపికలు ఎప్పుడూ నిస్సిగ్గుగా డబ్బు ప్రాతిపదికన మాత్రమే ఉంటుందని అది అందరికీ తెలిసిన విషయమేనని అంబటి రాంబాబు చెప్పారు. 
 
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయటంలో మాత్రం విఫలమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ ఉనికి కూడా లేకుండా చేయాలనే ఆలోచనతో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశ చూపి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. 
 
చేర్చుకున్న వైసీపీ ఎమ్మెల్యేలలో చాలా మంది ఎమ్మెల్యేలకు 2019 ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వకుండా కొందరు రాజకీయ నాయకుల భవిష్యత్తును చంద్రబాబు ముంచేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ద్వారా డబ్బు పంపి ఫోన్ లో సంభాషణలు జరిపి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. గడచిన పదేళ్లలో చంద్రబాబు టీడీపీని కార్పొరేట్ పార్టీగా మార్చేశారని ఒకప్పుడు ఆ పార్టీలో పని చేసి పార్టీ మారిన నేతలే ఆరోపణలు చేయడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: