ఆర్టీసీ ని ప్రభుత్వం లో కలుపుతూ జగన్ సర్కార్ తెచ్చిన చట్టం తో ఆర్టీసీ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. ఒక్కసారి తమ సంస్థ గతం గుర్తు చేసుకున్నారు.ఆర్టీసీని నిర్వీర్యం చేయడం కోసం, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం కోసం చంద్రబాబు తన బినామీలకు, అనుచరులకు కట్టబెట్టారని వారు అంటున్నారు. డిపోల్లో కమర్షలైజ్ చేయాలని విజయవాడ, రాజమండ్రి, విశాఖ, కాకినాడ, ఏలూరుల్లో బినామీలకు కాంట్రాక్టులు పంచిపెట్టారు. అక్రమంగా ప్రైవేటు రవాణా వ్యవస్థను పెంచి పోషించారు. 

 

దివాకర్‌ రెడ్డి ట్రావెల్స్ వందలాది బస్సులు నడుపుతోంది. కేశినేని నానీకి కూడా 500కు పైగా బస్సులున్నాయి. కాళేశ్వరి, మోడ్రన్ బస్సులు పేరుతో టీడీపీ బినామీల వేలాది ప్రైవేటు బస్సులను ప్రోత్సహించడానికి ఆర్టీసీని సర్వనాశనం చేసారని గుర్తు చేస్తున్నారు. ఆర్టీసీని రిలయన్స్ కు అమ్ముకోవాలనే ఉద్దేశ్యంతో పావులు కూడా కదిపాడు చంద్రబాబు అంటున్నారు. కానీ అదృష్టవశాత్తూ 2004లో రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అవ్వడంతో ఆ ప్రయత్నం సాగలేదు. అప్పుడే కనుక వైయస్సార్ సీఎం కాకపోయి ఉంటే ఆర్టీసీ అనేది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కాకుండా రిలయన్స్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయ్యుండేది అంటున్నారు.

 

 

వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఆర్టీసీని ఎలా కాపాడారో అందరికీ తెలుసు. అప్పటికున్న అరియర్స్ 1200 కోట్ల రూపాయిలు రీయంబర్స్ చేసారు. అంతేకాదు 12000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసారు వైయస్సార్. బస్ పాసులపైన రీయంబర్స్మెంట్ 500 కోట్లు ఇచ్చే ఆనవాయితీని రాజశేఖర్ రెడ్డిగారు ఆరోజున ప్రవేశపెట్టారు. దాంతో తర్వాతి ప్రభుత్వాలు, చివరకు చంద్రబాబు కూడా ఆ సొమ్ము ఇవ్వాల్సి వచ్చింది. ఇలా ఎన్నో అండదండలు అందించడం వల్లే ఆర్టీసీ బ్రతికి బట్టకట్టగలిగింది. ఆ వైయస్సార్ తనయుడైన వైయస్ జగన్ మరో నాలుగడుగులు ముందుకేసి ఈ ఆర్టీసీ వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ఓనర్లకు లాభం వస్తుంది తప్ప ఆర్టీసీకి లాభం రాదు. అది మేనేజ్‌మెంట్ లోపమా లేక ప్రభుత్వం సపోర్టు చేయకపోవడం వల్లో నష్టమే ఎప్పుడూ వస్తుంటుంది. 

 

 రెండునెలల వ్యవధిలోనే 250 కోట్ల నష్టాలను తగ్గించామని ఇటీవల మంత్రి పేర్ని నాని చెప్పిన విషయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.ఆర్టీసీ వ్యవస్థను బాగుపరచాలని, ఆర్టీసీకి మంచిరోజులు రాబోతున్నాయి. కార్మికులకు మంచి జరగబోతోంది. గతంలో ఆర్టీసీ ఒక బస్సుకు 8 మంది పనిచేసేవారు. ఇప్పుడు దాన్ని 5 మందికి కుదించారు. సాంక్షన్‌ పోస్టుల కంటే తక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. దాన్ని ఫిలప్ చేయాలని కోరుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు.

 

ఆర్టీసీ విలీనం కార్మికుల కల. దాన్ని నెరవేరుస్తున్నారు సీఎం జగన్. ఎంతో బృహత్తరమైన, ప్రజాహితమైన కార్యక్రమాన్ని, కార్మిక సంక్షేమ కార్యక్రమాన్ని బిల్లుగా తెచ్చి, జనవరి 1కల్లా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినందుకు ముఖ్యమంత్రిగారికి పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. కార్మికులకు ఇవాళ పెద్ద పండుగలాగే ఉందంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: