భారతదేశంలో జనాభా రోజు రోజుకు బాగా పెరుగుతుండంతో ఈ నేపథ్యంలో భారత్‌లోని జనాభాను లెక్కలోకి తీసుకుంటే పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యను కూడా భారీగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  తెలిపారు. లోక్‌సభ సీట్లకు ప్రస్తుతమున్న 543 నుంచి 1000కి, అదే శాతంలో రాజ్యసభ సీట్లను కూడా పెంచ వలయును అనే ప్రణబ్‌ ముఖర్జీ గారు తెలిపారు. ఒక్కో సభ్యుడు ప్రాతినిధ్యం వహించే జనాభా సంఖ్యలోనూ ప్రస్తుతం చాలా తేడా ఉందన్నారు దీనివల్ల ఒక్కో లోకసభ సభ్యులు కొన్ని లక్షల జనాభాకు జవాబు చెప్పుకోవలసిన అవసరం అది అని అన్నారు. ఒక్కో లోక్‌సభ సభ్యుడు 16 నుంచి 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, వారందరికి ఆయనొక్కడు ఎలా అందుబాటులో ఉండగలడని ప్రశ్నించారు. 

 

ఒక్కో ఎమ్మెల్యే ను కలవడానికి కొన్ని రోజుల వరకు  దర్శనము అటువంటప్పుడు పార్లమెంటు సభ్యులు కలవడానికి ఇంకా ఎన్ని రోజుల టైము వేచి ఉండ వలయునో ఊహకందనిది.‘1971 జనాభా లెక్కల ను అనుసరించి చివరగా 1977లో లోక్‌సభ సభ్యుల సంఖ్యను సవరించారు.. అప్పడు కేవలము జనాభా 55 కోట్లు. మాత్రమే. ప్రస్తుత జనాభా అందుకు రెండింతలు పెరిగినది. పెరిగిన జనాభాకు సరిపోయేటట్లు లోకసభ సీట్లు కూడా పెంచవలెను. అందువల్ల లోక్‌సభ సభ్యుల సంఖ్యను కూడా కనీసం 1000 చేయాలి’ అన్నారు. ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. ‘భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతమైందా? ముందున్న సవాళ్లేంటి’ అనే అంశంపై సోమవారం అటల్‌ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ ప్రసంగాన్ని ప్రణబ్‌ ముఖర్జీ వెల్లడించారు.

 

 ఈ సందర్భంగా మనము ఓటరు ఇచ్చే తీర్పును కూడా పార్టీలు సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ‘ప్రజలు సంఖ్యారూపంలో ఆధిక్యత ఇచ్చి ఉండ వచ్చును. కానీ దేశంలోని మెజారిటీ ఓటర్లు ఒకే పార్టీకి మద్దతివ్వడం ఇంతవరకు జరగనే జరగలేదు. దేశములో భారతీయ ఓటర్లు ఇచ్చేటటువంటి తీర్పును రాజకీయ పార్టీలెప్పుడూ ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు.


    

 

మరింత సమాచారం తెలుసుకోండి: