1982 సంవత్సరంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో చైతన్య రథం ఎక్కి రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తొలి రాజకీయ పార్టీగా టీడీపీని నిలిపారు. 1995 సంవత్సరంలో చంద్రబాబు పార్టీలో ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి ఎన్టీయార్ ను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడి పదవి నుండి బయటకు పంపారు. 
 
చంద్రబాబు ఇండియా టుడేకు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీయార్ లో నైతిక విలువలు శూన్యం అంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ చంద్రబాబు నేటికీ ఎన్నికల్లో ఎన్టీయార్ పేరును స్తుతిస్తూనే రాజకీయాలు చేస్తున్నారు. ఎన్టీయార్ లో నైతిక విలువలు శూన్యం అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఆ తరువాత కాలంలో ఎన్టీయార్ దైవాంశ సంభూతుడు అని స్తుతిస్తూ ఎన్టీయార్ పేరుతో అనేక పథకాలను ప్రవేశపెట్టారు. 
 
సీనియర్ ఎన్టీయార్ పై, ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీపై ఎంతో అభిమానం ఉన్న ప్రజలు చంద్రబాబును కూడా గెలిపించారు. కానీ చంద్రబాబు రైతులను, ప్రభుత్వ ఉద్యోగులను, అన్ని వర్గాలను మోసం చేయడంతో 2004 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్టీయార్ పేరు చెప్పుకొని ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని విజయం సాధిస్తే 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్టీయార్ పేరుతో పాటు బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకొని విజయం సాధించారు. 
 
40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఈ 40 సంవత్సరాలలో ప్రజాభిమానం సంపాదించుకోవడంలో, ప్రజల మద్దతు పొందడంలో పూర్తిగా విఫలమయ్యారు. 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకపోవటంతో 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. చంద్రబాబు చివరకు తన కొడుకు నారా లోకేశ్ ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: