రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.  ఎవరు ఎలా మారిపోతారో కూడా చెప్పలేరు.  రాజకీయాలంటే సొంతలాభం చూసుకోవడమే.  సొంతంగా లాభం చూసుకునే వ్యక్తులు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తుంటారు.  సేవచేసే భాగ్యం కల్పించాలని కోరుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టినా ఆ తరువాత, ఆ విషయం పక్కన పెట్టి, కొసరు విషయంపైనే దృష్టి పెడతారు.  రాజకీయాల్లోకి వచ్చాము ఎంత సంపాదించాం ఎంత సంపాదించాలి.. ఏ రేంజ్ లో సంపాదించాలి... సంపాదించాలి అంటే ఏం చేయాలి అనే విషయాల చుట్టూనే ఆలోచిస్తారు.  


ఇలా ఆలోచనలు చేసే వ్యక్తులే రాజకీయాల్లో రాణిస్తుంటారు.  రాజకీయాల్లో ఓ మాట ఉంటుంది.  శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఎవరూ ఉండరు.  ప్రతి ఒక్కరు కూడా స్వలాభం కోసమే చూసుకుంటారు.  రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఎలాంటి రాజకీయం చేయాలో తప్పకుండా నేర్చుకుంటారు.  రాజకీయాల గురించి తెలుసుకొని నేర్చుకొని, ఓనమాలు దిద్దుకొని ఎదుగుతుంటారు.  


రాజకీయాలు ఎలా ఉండాలి.. ఎలాంటి రాజకీయాలు చేస్తే విజయం సాధిస్తాం అనే విషయాలను తప్పనిసరిగా నేర్చుకుంటారు. ఇప్పుడు వైకాపాలో ఉన్న నేతల్లో చాలామంది తెలుగుదేశం దేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులే.  తెలుగుదేశం పార్టీలో చేరి ఓనమాలు నేర్చుకొని రాజకీయాల్లో రాణించిన వ్యక్తులే.  రాజకీయాల్లో ఏ నాయకులు ఏ పార్టీలో ఉంటాడో చెప్పడం కష్టం.  పరిష్టితులకు అనుగుణంగా గెలిచే పార్టీని చూసుకొని జంప్ అవుతుంటారు.  


ఇలా తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న కొడాలి నాని, రోజా, తదితరులు వైకాపాపార్టీలో చేరారు.  వీరంతా ఇప్పుడు ఆ పార్టీలో పదవులు అనుభవిస్తున్నారు.  2009 లో రోజా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నది.  అయితే, అప్పట్లో సొంత పార్టీలో ఉన్న వ్యక్తులే ఆమెను ఓడించారు.  అప్పటి నుంచి బయటకు వచ్చి 2011లో వైకాపాలో జాయిన్ అయ్యింది.  అప్పటి నుంచి జగన్ కు సపోర్ట్ గా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని విమర్శితున్నారు.  అటు కొడాలి నాని కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైకాపాలో జాయిన్ అయినా తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఒంటికాలితో లేచి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.  అసెంబ్లీలో బాబుగారిపై మూకుమ్మడి దాడులు చేస్తున్నా.. బాబు సైలెంట్ గా ఉండిపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: