సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సభలో మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడటం టైం వేస్ట్ అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 1999 లో అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు రైతుల్ని మాత్రం పూర్తిగా విస్మరించారు. ఫలితంగా 2004,2009 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఓడిపోయారు. 
 
రైతుల ఓట్లు పడితే మాత్రమే అధికారంలోకి వస్తాననే ఆశతో చంద్రబాబు 2014 ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని రుణమాఫీ హామీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. నిజంగా చంద్రబాబు రుణమాఫీ చేస్తాడేమో అని నమ్మిన రైతుల్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నట్టేట ముంచారు. అధికారంలోకి రాగానే రుణ మాఫీకి షరతులు విధించిన చంద్రబాబు ఆ తరువాత 5 విడతల్లో రుణమాఫీని చెల్లిస్తానని రైతులకు చెప్పారు. 
 
అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కేవలం 3 విడతలు చెల్లించిన చంద్రబాబు ఎన్నికల ముందు 4,5 విడతల నిధులు విడుదల చేసినట్లు ఎల్లో మీడియాలో వేయించుకున్నారు. కానీ ఒక్క రైతు ఖాతాలో కూడా ఆ నిధులు జమ కాలేదు. చంద్రబాబు చేసిన మోసం అర్థమైన రైతులు 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిపించి చంద్రబాబును ప్రతిపక్షానికి పరిమితం చేశారు. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు రైతుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రైతు పరిస్థితి నానాటికీ దిగజారిపోయిందన్న మాట వాస్తవం. 2004, 2009 ఎన్నికల ఫలితాలతో రైతు దెబ్బేంటో రుచి చూసిన చంద్రబాబు మరో మారు 2019 ఎన్నికల ఫలితాలతో రైతు దెబ్బేంటో చవిచూశారు. చంద్రబాబు ఘోర పరాజయానికి రైతులే ప్రధాన కారణం కావడం గమనార్హం. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రైతుల్ని విస్మరించకుండా ఉంటే మెరుగైన ఫలితాలు సాధించేవారేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: