ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. కాంగ్రెస్ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. వామపక్ష పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించగా వేల సంఖ్యలో ప్రజలు బషీర్ బాగ్ చేరుకున్నారు. 
 
రైతులను పోలీసులు లాఠీలతో చితకబాదారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా పోలీసులు కాల్పులు జరిపారు. రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు కార్యకర్తలు పోలీసు కాల్పుల్లో మరణించారు. ముగ్గురు కార్యకర్తలు మరణించగా వందలాది మంది జనాలకు గాయాలయ్యాయి. కానీ జనాలు మాత్రం వెనక్కు తగ్గలేదు. పోలీసులపైకి జనాలు రాళ్ల వర్షం కురిపించారు. బషీర్ బాగ్ చౌరస్తా పోలీసుల లాఠీ చార్జీ, కాల్పులు, జనాలు రాళ్లు రువ్వటంతో యుద్ధ రంగాన్ని తలపించింది. 
 
ఈ ఘటనలో కొందరు పోలీసులకు కూడా గాయాలు కాగా ఉదయం నుండి సాయంత్రం వరకు బషీర్ బాగ్ చౌరస్తా దగ్గర యుద్ధకాండ కొనసాగింది. చంద్రబాబు కాల్పుల్లో ముగ్గురు చనిపోయినా వామపక్ష పార్టీలతో, ఉద్యమకారులతో కనీసం చర్చలు కూడా జరపకపోవటం గమనార్హం. చంద్రబాబు తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో బషీర్ బాగ్ లో మారణ హోమానికి కారణమయ్యారు. 
 
ఆ తరువాత ప్రజలు 2004, 2009, 2019 ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. ఇప్పటికీ చంద్రబాబును బషీర్ బాగ్ మారణహోమం వెంటాడుతూనే ఉంది. 1999 ఎన్నికల తరువాత చంద్రబాబు 2014లో మాత్రమే అధికారంలోకి వచ్చారు. 2014లో కూడా చంద్రబాబుకు జగన్ కు మద్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కేవలం 5 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. బషీర్ బాగ్ దుర్ఘటన చూసి చలించిపోయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: