ఇన్ని రోజులు దేశమంతా మోడీ హవా గట్టిగా వినిపించింది. కానీ మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాజిక్ కనిపించలేదనే చెప్పాలి. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి. ఆ తర్వాత దేశమంతటా పట్టు సడలి పోతున్నట్లు అనిపిస్తుంది. అక్టోబర్ నెలలో మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తో పొత్తుతో బరిలోకి దిగిన బిజెపి. ఆ తర్వాత సీఎం కుర్చీ విషయంలో వారిద్దరికీ మనస్పర్థలు వచ్చి శివసేన ను దూరం చేసుకుంది బిజెపి. దీంతో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

 

 ఇప్పుడు దీని ప్రభావం కేవలం మహారాష్ట్ర లో కాకుండా రాజ్యసభలో కూడా బిజెపికి ఇరకాటంలో నెట్టేస్తుంది. లోక్సభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా కూడా ఎవరి సాయం లేకుండానే  ఆమోదించుకునే మెజారిటీ బిజెపికి ఉంది. కానీ రాజ్యసభలో ఆ పార్టీ పరిస్థితి అది కాదు. అక్కడ ఎవరో ఒకరి సపోర్ట్ లేకుండా బిల్లును పాస్ చేసుకోలేకపోతుంది బిజెపి. శివసేన దూరం కావడంతో ఈ సమస్య ఇంకా తీవ్రం అయింది.

 

 కానీ తెలుగు రాష్ట్రంలో వైసీపీని తమ పార్టీకి అనుగుణంగా మార్చుకునే లాగా ఢిల్లీ వర్గాల్లో చర్చలు గట్టిగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటులో కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సిపి కి మాత్రమే అధిక బలం ఉంది.

 

మొన్న జరిగిన ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు గెలిచిన వైఎస్ఆర్సిపి ఆ బలంతో మొత్తం ఆరుగురు రాజ్య సభ ఎంపీలని గెలిపించుకునే మెజారిటీ ఉంది. దానితో ఈ పార్టీతో స్నేహపూర్వకంగా ఉండాలని  ఆశ పుట్టిస్తుంది. ఒక వేళ వైసిపి కనుక బిజెపి కి మద్దతు ఇస్తే వారికి ఇచ్చే పదవులపై బీజేపీ అధిష్టానం స్పష్టమైన క్లారిటీతో ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్న విధంగా జరిగితే అమలాపురం ఎంపీ చింతా అనురాధ లోక్సభ డిప్యూటీ స్పీకర్ గా చేస్తారని తెలుస్తోంది. అలాగే వైయస్ఆర్సిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డిని కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా చేయవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: