2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ 2014 లో జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా మోడీ హవా కనిపించింది. కానీ 2019లో ఈ హవా కేవలం మోడీ నుంచి కాకుండా ఆయన వెనకాలే ఉన్న అమిత్ షా రాజకీయ చతురత వల్ల బిజెపి సునాయసంగా గెలిచిందని అందరికీ తెలిసిన విషయమే.

 

 ఎన్నో రోజులుగా నరేంద్ర మోడీని అంటి పెట్టుకొని ఆయనకు ఎంతో విధేయులుగా ఉన్న అమిత్ షా. ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ తర్వాత చాలా పవర్ఫుల్ అయిన వ్యక్తిగా ఎదిగారు. చాలా మంది వీరిద్దరి స్నేహాన్ని చూసి కృష్ణార్జునులు గుర్తుకొస్తారు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కాశ్మీర్ సమస్య, అయోధ్య భూవివాదం సమస్య, పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం తెలిపేలా చేసింది కేవలం మోడీ మాత్రమే కాదు దాని వెనకాల అమిత్ షా కృషి ఎంతో ఉంది.

 

 ఈ మూడు విషయాల్లో కూడా మోడీ అమిత్ షాని ఎంతో పొగిడారు. కానీ బీజేపీ వాళ్లు నరేంద్ర మోడీ అమిత్ షా లను కృష్ణార్జునల తో పోల్చడం తమిళ్ నటుడు సిద్ధార్థ్ కి నచ్చలేదు. తెలుగుతో పాటు, తమిళ హిందీ సినిమాల్లో నటించిన సిద్ధార్థకు దేశ వ్యాప్తంగా ఒక మోస్తరు గుర్తింపు ఉంది. సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉండే సిద్ధార్థ్ కొన్ని రోజుల క్రితం బీజేపీ మీద సెటైర్లు కూడా వేశారు.

 

ఇప్పుడు ఈ విషయంలో మళ్లీ ఆయన గళం విప్పారు .పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం వివాదం గురించి సిద్ధార్థ్ ఇప్పుడు మోడీని దుర్యోధనునితో అలాగే అమిత్ షాని శకుని తో పోల్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అందరూ ఎలా స్వీకరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: