ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ప్రకటించారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని, వికేంద్రీకరణ జరగాలని జగన్ పేర్కొన్నారు. వారం రోజుల్లో రాజధాని గురించి నివేదిక వస్తుందని జగన్ అన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూల్ కు జ్యుడీషియల్ క్యాపిటల్, హైకోర్టు వస్తుందని అన్నారు. 
 
దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో మూడు రాజధానులు ఉన్నాయని ఇక్కడ ఉంటే తప్పేంటని జగన్ అన్నారు. ఇలాంటి ఆలోచనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. రాజధాని ఒకే చోట ఉండాలన్న ఆలోచన ధోరణి మారాలని జగన్ అన్నారు. డబ్బులు ఎక్కడినుండి వస్తున్నాయి, ఎలా ఖర్చు చేస్తున్నాం అనే దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉందని జగన్ అన్నారు. 
 
ఉద్యోగులు పని చేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ వైజాగ్ లో ఉన్నాయని విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పడితే పెద్దగా ఖర్చవదని అన్నారు. విశాఖకు మెట్రో రైలు వస్తే సరిపోతుందని ఇంకేం అవసరం లేదని జగన్ అన్నారు. నిపుణులతో ఇలాంటి ఆలోచనలు చేయడం కోసమే ఒక కమిటీని ఏర్పాటు చేశామని జగన్ అన్నారు. కమిటీ అధ్యయనం చేస్తోందని త్వరలో నివేదిక ఇవ్వనుందని చెప్పారు. 
 
భవిష్యత్ తరాలకు మంచి జరిగేలా నివేదిక వచ్చిన తరువాత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. మనకున్న ఆర్థిక వనరులతో ఏ విధంగా చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. ఇంతకంటే మంచి సూచనలు, సలహాలు ఇస్తే తీసుకుంటామని జగన్ అన్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం చంద్రబాబు రాజధానిని సింగపూర్ లా అభివృద్ధి చేస్తానన్న నిర్ణయం కంటే గొప్పగా ఉందని అన్నారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం పట్ల ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. మూడు ప్రాంతాలను సమాన అభివృద్ధి చేయాలన్న జగన్ నిర్ణయంతో ప్రజలు ఏకీభవిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: