దిశ కేసు ప్రభావం ఇప్పుడు తెలంగాణాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ పోలీసులకు, నిందితులకు చుక్కలు చూపించిన ఈ కేసు ఇప్పుడు ఏకంగా ప్రజా ప్రతినిధులకు షాక్ ఇస్తోంది. అదేంటీ.. దిశ కేసు కు ఎమ్మెల్యే లకు లింక్ ఏంటీ అంటారా.. కథ చాలా ఉంది మరి.. అసలు విషయం ఏమిటంటే...

 

 

మహిళలపై హింస, ఇతర దురాగతాలకు సంబంధించి తెలంగాణకు చెందిన 47 మంది ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారించి తగిన చర్య తీసుకోవాలని, రాష్ట్ర హైకోర్టుని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇప్పుడు ఇది ఎమ్మెల్యే ల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. కేంద్ర న్యాయశాఖ ఈమేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు ఒక లేఖ రాసింది.

 

 

దీని ప్రకారం.. తెలంగాణలో 47 మంది ఎమ్మెల్యేలపై విచారణ జరగబోతోందట. కేంద్రం ఈ మేరకు తెలంగాణ హైకోర్టును కోరిందన్న సమాచారం వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 6 నెలల్లోపు పరిష్కరించాలని జలగం సుధీర్‌ అనే వ్యక్తి రాసిన లేఖపై కేంద్రం ఇలా ఈ స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

 

మరి ఆ 47 మంది ఎమ్మెల్యే లు ఎవరు..? వారిపై ఉన్న కేసులు ఏంటి.. ఇప్పుడు వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి.. అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చూడాలి ఈ విషయం ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది.

 

ఇటీవలే ఉన్నావ్ రేప్ కేసు లో ఒక బీజేపీ ఎమ్మెల్యే దోషిగా తేలిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా చాలామంది ప్రజా ప్రతినిధులు ఇలాంటి రేప్ కేసుల్లో ఇరుక్కున్నారు.. ఇప్పుడు ఈ 47 మంది లో కొందరి పై అభియోగాలు రుజువు అయితే అది సంచలనం అవుతుంది. అలాంటి పరిస్థితి వస్తే అది తెలంగాణా ప్రభుత్వానికీ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: