ప్రపంచంలో భారతీయులు ప్రతి దేశంలోను ఉన్నారు.  ముఖ్యంగా దక్షిణాఫ్రికా దేశంలో భారతీయులు ఎంతమంది ఉన్నారో చెప్పక్కర్లేదు.  బ్రిటిష్ పరిపాలన కాలంలో అక్కడి చెరుకు తోటల్లో పనికోసం ఇండియా నుంచి లక్షలాది మందిని దక్షిణాఫ్రికా తీసుకెళ్లారు.  అక్కడ పంటపొలాల్లో పనులకు కుదిర్చారు.  ఆ తరువాత బ్రిటిష్ పాలన అంతం తరువాత కూడా ఇండియన్స్ అక్కడే స్థిరపడ్డారు.  

 


అలా అక్కడ ఇప్పుడు లక్షలాది మంది భారతీయులు ఉంటున్నారు.  అక్కడ చట్టసభల్లో కూడా చాలామంది ఇండియన్స్ ఉన్నారు.  కాగా, ఇప్పుడు హిందువుల పరిరక్షణ కోసం, హిందువులకు సంబంధించిన విషయాలను చట్టసభల్లో వినిపించడం కోసం కొత్త పార్టీ ఒకటి పుట్టుకొచ్చింది.  అదే ది హిందూ యూనిటీ మూవ్ మెంట్.  ఈ పార్టీని ఇటీవలే రిజిస్టర్ అయ్యింది.  దీనికి హిందూ ధర్మ సభ అధ్యక్షుడు రామ్ మహారాజ్ ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఉంటారు.  జయరాజ్ జాతీయ నాయకుడిగా ఉంటారు.  

 


హిందువులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఈ పార్టీ చూసుకోబోతున్నది.  జాతీయ స్థానిక చట్టసభల్లో హిందువుల వాణిని బలంగా వినిపించలేకపోతున్నారని, హిందువుల వాణిని బలంగా వినిపించేందుకు ఈ పార్టీని స్థాపించినట్టు తెలుస్తోంది.  గతంలో మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లో భారతీయ భాషలను పాఠ్యంశాలుగా చేర్చాలని, దీపావళిని ప్రభుత్వ జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.  

 


మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ భారతీయుల కోసం పోరాటం చేసిన సంగతి తెలిసిందే.  దక్షిణాఫ్రికాలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేస్తుండగా ఆయనను స్టేషన్ లోకి రాగానే తెల్లదొరలు బయటకు తోసేశారు.  అప్పటి నుంచి మహాత్మాగాంధీ పోరాటం చేయడం మొదలు పెట్టాడు.  1920 వరకు మహాత్మాగాంధీ నల్లజాతీయులు కోసం దక్షిణాఫ్రికాలో పోరాటం చేశారు. అయన పోరాటం ఫలితమే ఇప్పుడు అక్కడ భారతీయులు స్వేచ్చావాయువులు పీల్చుకుంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: