ఏపీ కి 3 రాజధానులు వస్తాయంటు జగన్ చేసిన ప్రకటనపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు ముందుగానే వైజాగ్ చుట్టుపక్కల భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.

 

పవన్ కల్యాణ్ ఏమంటున్నరం టే.. "జగన్ రెడ్డి గారు.. అసెంబ్లీలో ప్రటన ఒక వ్యూహం ప్రకారమే చేశారు..నేను పోరాట యాత్ర లో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర భూములు చాలా వరకు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు చెప్పారు.విశాఖ ప్రాంతంలో భూములను ముందుగానే హస్తగతం చేసుకుంటూ వచ్చారు..

 

అలాగే వివాదాస్పద భూములు, పంచాయతీలు మొదలు పెట్టారు.:విశాఖ భూముల విషయంలో కఠినంగా ఉన్న జాయింట్ కలెక్టర్ శివశంకర్ ను ఆఘమేఘాలపై తప్పించారు. అక్కడే కింద పోస్టుకు మార్చి అవమానించారు.ఆ పోస్టులో తమకు అనుకూలమైన వేణుగోపాల్ రెడ్డిని నియమించుకున్నారు.

 

ఈ హడావిడి బదిలీ వారం రోజుల కిందటే చేశారు.ఇలా చేయడాన్ని సీనియర్ ఐ.ఎ.యస్ అధికారులు కూడా తప్పుబడుతున్నారు.ఇక అక్కడ పులివెందుల పంచాయతీలు మొదలవుతాయి.సీజన్లో కొల్లేరు కొంగలు వచ్చినట్లుగా సంవత్సరానికి మూడు సార్లు ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ రాజధానికి వాలి వెళ్లాలన్నమాట.

 

మూడు సీజన్లలో అమరావతికి వచ్చి సభ నడిపి ఆ తర్వాత తాళాలు వేసేయాలనేది జగన్ రెడ్డి ఆలోచనగా ఉంది. అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు.. వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటు పడుతున్నారు..వారి పిల్లలు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు..

 

వాళ్లని మళ్లీ ఎగ్జిక్యూటీవ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా..రాజధాని మార్పు అంటే ఆఫీసు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం కాదు.కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించడమే..వారికయ్యే వ్యయప్రయాసలకి బాధ్యత ఎవరు తీసుకుంటారు.. అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. మొత్తానికి జగన్ ప్రకటన సంచలనం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: