కొన్నిరోజుల క్రిందట ఏపీలో వరుసగా కాల్ మనీ అనే భూతం చాలామంది అమాయకులని   చిత్ర హింసలకు గురిచేసింది   దానితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు .అవసరం కోసం వేలల్లో  డబ్బు తీసుకుంటే ..దానిని అదునుగా చేసుకొని వడ్డీ - వడ్డీకి వడ్డీ - చక్రవడ్డీ వేసి లక్షల్లో ఇవ్వాలని వారిని వ్యాపారస్తులు బెదిరిస్తున్నారు. వారు అడిగినంత ఇవ్వలేక చాలామందిబలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం అప్పుడు పెద్ద వివాదంగా మారింది దానితో  కొన్ని రోజులుగా కాల్ మనీ రాక్షసుల అరాచకాలు తగ్గిపోయాయి.

 

కానీ తాజాగా మరోసారి కాల్ మనీ వ్యవహారంపాడగా విప్పింది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మరోసారి కాల్ మనీ దందా భయాందోళనకు గురిచేస్తోంది. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు చెల్లించిన తమను  వేధిస్తున్నారంటూ రెండు రోజుల కిందట వెంకట్ అనే యువకుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యా ప్రయత్నం  చేశాడు. ఆ సంఘటన  మరిచిపోక ముందే మంగళగిరి మండలంలో తాపీ మేస్త్రీ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు భరించలేక మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ పోలిశెట్టి పూర్ణచంద్రరావు - లక్ష్మి దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 

 

వడ్డీ వ్యాపారులు తమను ఎలా వేధించారో.. పది పేజీలఉత్తరం రాసి  తామూ పడ్డ బాధను  వాళ్లు వివరించారు. కాల్ మనీ రక్కసి కారణంగానే తాము ప్రాణాలు వదులుతున్నట్లు క్లుప్తంగా  రాసారు .  పూర్ణచంద్రరావు తాపీ మేస్త్రీ. పనుల్లేక పోవడంతో అప్పులపాలయ్యాడు. వడ్డీ వ్యాపారుల వద్ద కేవలం రూ.30 వేలు ఒకసారి 20వేలు మరోసారి అప్పు తీసుకున్నాడు. 30వేల అప్పుకు లక్షన్నర.. ఇరవై వేల రూపాయలకు సుమారు లక్ష రూపాయలు  కట్టాలని వడ్డీ వ్యాపారులు వేధింపులకు గురిచేయడంతో దానితో ఏమి చేయలేని  పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

ఇంట్లోని  తమ మహిళల పట్ల చాల  నీచంగా ప్రవర్తించారని వివరించారు లేఖ లో.రూ.10 నుంచి రూ.15ల వడ్డీ కట్టాల్సిందేనని లేకుంటే భార్య - కోడలు ఆఖరికి చిన్నారి మనవరాలితో కూడా వ్యభిచారం చేయిస్తామని పూర్ణచంద్రరావును బెదిరించారని వారి  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వడ్డీ వ్యాపారస్తులు తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం వల్లనే   ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. వేధింపులకు పాల్పడిన వారి పేర్లతో సహా బయటపెట్టినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: