తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న జిల్లాల్లో అనంతపురం జిల్లా ముందు వరుసలో ఉంటుంది. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జిల్లాలో పార్టీని మోస్తూ వచ్చారు అక్కడి కార్యకర్తలు... ఇక పరిటాల రవి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన బలమైన నాయకుడిగా ఎదగడం, కాంగ్రెస్ నేతలకు దీటుగా రాజకీయం చేయడం వంటివి మనం చూసాం... క్షేత్ర స్థాయిలో పార్టీని రవి జిల్లాలో బలోపేతం చేసారు అనేది వాస్తవం.

 

ఆయన ఇమేజ్ కారణంగా పార్టీ జిల్లాలో ఎక్కువగా స్థానాలు గెలవగలిగింది. 2014 ఎన్నికల్లో కూడా ఈ హవా కొనసాగింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పరిటాల కుటుంబం హవా కొన్ని కారణాల వలన తగ్గుతూ వస్తుంది. రాజకీయంగా అండగా ఉన్న కుటుంబమే పార్టీని ఇబ్బంది పెట్టింది. ఈ ఎన్నిక‌ల్లో వాళ్ల‌కు బీసీలు పూర్తిగా దూర‌మ‌య్యారు. దీంతో ప‌రిటాల కంచుకోట‌లు అయిన పెనుగొండ‌, రాఫ్తాడు రెండూ బ‌ద్ద‌ల‌య్యాయి. ఇక్క‌డ వైసీపీ విజ‌యం సాధించింది. రాఫ్తాడులో ప‌రిటాల శ్రీరామ్ సైతం స్వ‌యంగా పోటీ చేసి ఓడిపోయారు.

 

ఇప్పుడు వాళ్ళు పార్టీకి దూరంగా ఉన్నారని అంటున్నారు. ఓటమీ తర్వాత పార్టీ సమావేశాల్లో ఎక్కువగా పాల్గొన్న యువనేత పరిటాల శ్రీరాం ఎక్కువగా ఫోన్ తోనే గడిపారు అనే ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు ప్రసంగాలు కూడా ఆయన వినలేదని పలువురు విమర్శించారు. దీనిపై మీడియాలో కూడా కథనాలు వేసే వారు కూడా అప్పట్లో ఆగిపోయారు. ఇప్పుడు చంద్రబాబు జిల్లా పర్యటనలో ఉన్నారు.

 

అక్కడి కార్యకర్తలతో సమావేశం అవ్వడానికి వెళ్ళారు. అయితే పరిటాల అభిమానులు గాని, పరిటాల శ్రీరాం గాని పెద్దగా పట్టించుకోలేదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఏదో తూతూ మంత్రంగా ఆయన వెళ్ళారు గాని ఆయన వర్గాన్ని ఆపేసారని, వాళ్లకు పట్టున్న గ్రామాల నుంచి కూడా పెద్దగా కార్యకర్తలు వెళ్లలేదని... వాళ్ళ అభిమానులు ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా అభిమానులు రాలేదని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: