ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేకత విషయంలో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ప్రచారం చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి గాను ప్రభుత్వ వ్యతిరేకతను ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా విపక్షం ఎక్కువగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇక జగన్ ప్రతీ నిర్ణయాన్ని ప్రతీ మాటను విపక్షం తప్పుబడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది.

 

తమ అనుకూల మీడియాలో వచ్చే కథనాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కువగా నమ్ముతున్నారు, వాటిని ఎక్కువగా ప్రచారం చేస్తూ జగన్ ని బద్నాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అయితే అది వాస్తవం కాదని అంటున్నారు పరిశీలకులు... తమ ప్రభుత్వంలో ప్రభుత్వం వైపే ప్రజలు ఉన్నారని అనుకున్నట్టే ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తున్నారు తెలుగుదేశం నేతలు అంటూ... పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత చాలా తక్కువగా ఉందని, సంక్షేమ పథకాలు అనేవి ప్రజలకు ఎక్కువగానే అందుతున్నాయని,

 

జగన్ తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల్లో ఎక్కువగా నమ్మకం పెరుగుతుందని, ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే జగన్ కొన్ని అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నారని, పేదవాడికి... అందాల్సినవి అన్ని ప్రభుత్వం నుంచి అందుతున్నాయని దీని కారణంగా ఏ ఇబ్బంది లేదని అంటున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడాలి అనుకోవడం తప్పు లేదు గాని... కేవల౦ ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే భ్రమలో ఉండి దాని గురించి మీడియా సమావేశాల్లో ఒకటికి పది సార్లు మాట్లాడటం అనేది అమాయకత్వం అని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

గ‌త ఐదేళ్ల‌లో కూడా బాబా క‌ళ్ల‌కు ఆయ‌న అనుకుల మీడియా కంత‌లు క‌ట్టేయ‌డంతో వాస్త‌వంగా గ్రౌండ్ లెవ‌ల్లో ఏం జ‌రిగింది ? అనేది ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌లేదు. బాబు చిత్తుగా ఓడిపోయారు. ఇక ఇప్పుడు కూడా ఆయ‌న అస‌లు నిజా నిజాలు తెలుసుకోకుండా ప్ర‌భుత్వ ప‌నితీరుపై స‌రైన అంచ‌నా లేకుండా ముందుకు వెళుతుండ‌డం మ‌ళ్లీ ఆయ‌న బొక్కా బోర్లా ప‌డేందుకు కార‌ణ‌మ‌య్యే ఛాన్సులే ఎక్కువుగా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: