సామాన్యుల రక్తాన్ని పీల్చి తద్వారా అప్పులు కట్టాలనే ఆలోచన నుంచి ముఖ్యమంత్రి  కేసిఆర్ బయటికి రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులపై తెలంగాణ ప్రజలంతా ఆలోచించాలని  ఆయన సూచించారు.  బుధవారం  అసెంబ్లీ మీడియా హాల్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. వెంటనే బెల్టు షాపులు తొలగించాలి, పర్మిట్ రూమ్ ఎత్తివేయాలి, ప్రధాన రహదారుల వెంబడి ఉన్న షాపుల్ని తీసేయాలి. రాష్ట్రంలో మద్యం వల్ల పెద్ద ఎత్తున అనర్థాలు జరుగుతున్నాయని గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నామన్నారు.  మద్యం రేట్ల పెంచడం ద్వారా అన్ని మద్యం అమ్మకాలను తగ్గించాలి అని కేసిఆర్ అనుకుంటే ఓకే, కానీ మరో వైపు బెల్టు షాపులను, పర్మిట్ రూమ్ లను, రహదారి వెంబడి షాపుల్ని ఎత్తివేయాలన్నారు. అంతే కానీ ఓ వైపు తాగండి తాగండంటూ ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాజానికి చెడుగా తయారైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోగా, మద్యం ద్వారానే విపరీతమైనటు వంటి ఆదాయాన్ని పెంచుకోవాలని చూడటం, మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని పరిపాలించాలని ముఖ్యమంత్రి అనుకోవడం దురదృష్టకరం. ఆరేళ్లలో తెచ్చిన అప్పులు, చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీని మధ్య ఆదాయంతో చెల్లించాలని కేసీఆర్ చూస్తున్నారు. ప్రజలు మా మీద కాదు, ట్యాక్స్ పేయర్స్ కడుతున్నారు మాకేంటి అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే అప్పులన్నీ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజల మీద భారం పడుతోంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం మద్యం ధరలు పెంచడం, పెట్రోలియం ఉత్పత్తుల మీద ట్యాక్స్ లు విధించడం ద్వారానే ఆదాయాన్ని పెంచుకునే వీలుంది. ఈ రెండిటి ద్వారానే అప్పులు తీర్చాలని చూస్తోంది. అయితే ఈరెండిటినీ ఎక్కువ వినియోగిస్తున్నది సామన్య ప్రజలే. 

రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే 25 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ఆదాయంగా చూపించనుంది. సంవత్సరానికి ఒక సగటున రోజూ మద్యం సేవించే వ్యక్తి 40 వేల రూపాయలు వెచ్చిస్తున్నాడు. ఇప్పటివరకు 3లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. తెలంగాణ ప్రజల్ని తాక్టటు పెట్టి అప్పులు చేశారు. అయితే  ఇంకా చేస్తామని కేసిఆర్ చెబుతున్నారు. ప్రాజెక్ట్ లో రీ డిజైనింగ్ చేసి బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి కొంతమందికి వాటిని కట్టబెట్టి చివరికి ఆ తెచ్చిన అప్పులు సామాన్యుని చేత కట్టిస్తున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు సంబంధించిన డిపిఆర్ అందించమని అసెంబ్లీ కూడా అడిగాను. ఇంతవరకు ఇవ్వలేదు. సహేతుకంగా లేనటువంటి అప్పులు ఆపకపోతే రాబోయో అప్పుల భారం కూడా సామాన్యులు మీదే పడుతుంది. రాబడి నంతా అప్పులు కట్టడానికే సరిపోయే విధంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను ఆపాల్సిన అవసరం ఉంది. 

పేద మధ్యతరగతి చిన్న సన్నకారు ప్రజలపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా ముఖ్యమంత్రి  మద్యం ద్వారా ఆదాయం సంపాదించాలన్న ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో చేద్దామనుకుంటున్న అప్పుల్ని ఆపాలని కోరుతున్నా అప్పుల ఆపక పోయినా, మద్యాన్ని కంట్రోల్ చేయకపోయినా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ప్రజల్లో చర్చకు తీసుకెళ్తాం. అప్పులు ఇవ్వొద్దని ప్రజల పక్షాన ప్రజల ద్వారా కమర్షియల్ బ్యాంకులు కోరతాం. ఓ వైపు ఆర్థిక మాద్యం భారం రాష్ట్రం మీద లేదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెబుతున్నారు. మరోవైపు కెసిఆర్ చేసిన అడ్డగోలు అప్పులే రాష్ట్రం పై భారం పడుతున్నాయి. ఆరేళ్లుగా రెవెన్యూ జనరేషన్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అప్పులు కోసం బ్యాంకులకు సమర్పించిన డిపిఆర్ లను వెంటనే బహిర్గతం చేయాలని భట్టి డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: