2019 సంవత్సరంలో ఏపీ రాజకీయాల్లో ఎన్నో సంచలనాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2016 లో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 2019 జనవరి 9 ఇచ్చాపురంలో ముగిసింది. ఈ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్ని ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి . 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్లో 79.86 నమోదైంది . ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక 175 స్థానాలకు గాను వైసీపీ పార్టీ ఏకంగా 150 అసెంబ్లీ స్థానాలను గెలిచింది వైసీపీ . టిడిపి పార్టీలో కీలక నేతలు సైతం ఓటమి చవిచూడాల్సి పరిస్థితి ఏర్పడింది. టిడిపి మునుపెన్నడూ లేని విధంగా 23 అసెంబ్లీ స్థానాలు గెలిచి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 

 

 

 

2019 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలపకుండా జనసేన ఒంటరిగా పోటీ చేసింది. కాగా ఎన్నికల్లో జనసేన ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓటమిని చవిచూశాడు. 25 మంది మంత్రులతో జగన్ క్యాబినెట్ ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 

 

 

 

 ఇక కొన్ని రోజుల వరకు ఇతర పార్టీ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడంతో సైలెంట్ గానే ఉంది వైసిపి పార్టీ. కొన్ని రోజులు గడువు ముగియగానే.. ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే టిడిపి పార్టీ నుంచి వల్లభనేని వంశీ రాజీనామా చేసి చంద్రబాబుపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఇక  టిడిపి పార్టీకి చెందిన కీలక నేతలైన ఇద్దరు ఎంపీలు బీజేపీ పార్టీలో చేరడం కూడా ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారింది. ఇక టిడిపి పార్టీ నుంచి విభాగం అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు.రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కూడా ఆంధ్ర  రాజకీయాలలో పెద్ద దుమారమే రేపింది. ఇసుక కొత్త సమస్యలు పరిష్కరించాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ సెంట్రల్ పార్క్ లో లాంగ్ మార్చ్ నిర్వహించారు . ఇక అంతే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. ఇసుక సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్ష చేపట్టారు.వైసీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పు అంశం తెరపైకి రాగా ప్రస్తుతం మూడు రాజధాని నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు

మరింత సమాచారం తెలుసుకోండి: