ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏపీకి మూడు రాజధానుల అంశంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూల్, వైజాగ్ జిల్లాల్లో రాజధానులు రావొచ్చు...? రాకపోవచ్చు..? అని సమాచారం. మంత్రి పేర్ని నాని కమిటీ నివేదిక తరువాతే మూడు రాజధానుల గురించి నిర్ణయం తీసుకుంటామని కమిటీలో మూడు రాజధానుల కాన్సెప్ట్ ఉండొచ్చు... ఉండకపోవచ్చని వ్యాఖ్యలు చేశారు.
 
పేర్ని నాని మాట్లాడుతూ సీఎం జగన్ ఉండొచ్చు అని మాత్రమే చెప్పారని ఉంటుంది అని చెప్పలేదని అన్నారు.  ఒకవేళ మూడు రాజధానులు ఉన్నా అసెంబ్లీ మాత్రం అమరావతిలోనే ఉంటుందని అన్నారు. జగన్ 3 రాజధానులు ఉండొచ్చు అని మాత్రమే అన్నారని మూడు రాజధానులు పెడుతున్నామని చెప్పలేదు కదా అని వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో తప్ప చాలా రాష్ట్రాలలో సచివాలయం, హైకోర్టు వేరు వేరు చోట్ల ఉన్నాయని చెప్పారు. 
 
విశాఖలో రాజధాని పెడితే మాత్రం పెద్దగా ఖర్చు ఉండదని విశాఖలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయని చెప్పారు. గడచిన ఐదు సంవత్సరాలలో చంద్రబాబు 900 మందికి మాత్రమే ఫ్లాట్లు ఇచ్చారని రైతులెవ్వరికీ ఫ్లాట్లు ఇవ్వలేదని... రైతుల దగ్గర అసైన్డ్ భూములు కొన్నవారికి మాత్రమే ఫ్లాట్లు ఇచ్చారని అన్నారు. అమరావతిలో రోడ్ల కోసమే లక్ష రూపాయలు ఖర్చు చేస్తే మిగిలిన సౌకర్యాలకు ఎంత అవుతుంది..? అని ప్రశ్నించారు. 
 
కమిటీ నివేదికలో మూడు రాజధానుల కాన్సెప్ట్ లేకపోతే మాత్రం విశాఖ, కర్నూలు జిల్లా వాసులకు నిరాశ తప్పదని సమాచారం. కమిటీ ఈ రెండు జిల్లాలలో రాజధానులను ఏర్పాటు చేయాలని చెబితే మాత్రమే ఈ రెండు జిల్లాలకు రాజధానులు వచ్చే అవకాశం ఉంది. కమిటీ నివేదిక తరువాత ప్రభుత్వం రాజధానుల గురించి తుది నిర్ణయం ప్రకటించబోతుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: