+ తెలంగాణ‌లో అధికార పార్టీకి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో గ‌ట్టి దెబ్బ‌త‌గిలింది.
+ అధికార పార్టీ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. అయితే,ఆయ‌నకు తీవ్ర మైన ఎదురు గాలులు కూడా ఈ ఏడాది ఎక్కువ‌య్యాయి.
+ ఈ ఏడాది జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అనూహ్యంగా తెలంగాణ లో బీజేపీకి నాలుగు స్థానాల్లో విజ‌యం ద‌క్కింది.
+ తెలంగాణ నుంచి తొలిసారి కేంద్రంలో స‌హాయ హోంశామ‌ మంత్రిగా కిష‌న్ రెడ్డికి అవ‌కాశం ల‌భించింది.

 

+ తెలంగాణ‌లో అంతో ఇంతో ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఒకే సారి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయి, కేసీఆర్‌కు జై కొట్టిన చ‌రిత్ర కూడా ఈ ఏడాదే జ‌రిగింది.
+ ఖ‌మ్మంలో టీడీపీకి అండ‌గా ఉన్న నామా నాగేశ్వ‌ర‌రావు ఈ ఏడాదిలో జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముంద ఆయ‌న అనూహ్యంగా సైకిల్ దిగి కారెక్కేశారు. అదేస‌మ‌యంలో ఖ‌మ్మం ఎంపీ టికెట్ సంపాయించుకుని విజ‌యం సాధించారు.
+ హుజూర్ న‌గ‌ర్‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆర్టీసీ కార్మిక స‌మ్మెలో ర‌గిలిన వ్య‌తిరేక‌త‌ను సైతం అధికార పార్టీ జ‌యించి ఘ‌న విజ‌యం సాధించింది.

 

+ హుజూర్‌న‌గ‌ర్‌లో ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసిన టీడీపీ నాలుగోస్థానానికి కూడా ద‌క్కించుకోలేక పోయింది.
+ తెలంగాణ మ‌హిళా గ‌వ‌ర్న‌ర్‌గా త‌మిళ‌నాడుకు చెందిన త‌మిళిసై నియ‌మితుల‌య్యారు.
+ ఆర్టీసీ కార్మికుల స‌మ్మె 51 రోజులు సాగి రాష్ట్రాన్ని కుదిపేసింది.
+  కార్మికుల స‌మ్మెను ఎంతో తీవ్రంగా అణిచేసిన సీఎం కేసీఆర్‌.. అంత ఉదాత్తంగా వారిపై వ‌రాలు కురిపించారు.

 

+ ఈ ఏడాది జ‌రిగిన మ‌రో కీల‌క ఘ‌ట్టం.. ఏపీ-తెలంగాణ సీఎంల మ‌ధ్య స్నేహ గీతిక‌
+ ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఇరువురూ ప‌ర‌స్ప‌రం ఇచ్చి పుచ్చుకునే ధోర‌ణితో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు.
+ఏదేమైనా ఓవ‌రాల్‌గా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కారు జోరుకు కాస్త బ్రేక్ ప‌డినా చివ‌ర్లో జ‌రిగిన హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఏకంగా 40 వేల ఓట్ల భారీ మెజార్టీ రావ‌డంతో తెలంగాణ‌లో ఇప్ప‌ట్లో కారు జోరుకు బ్రేకులు ప‌డే ప‌రిస్థితులు లేవు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: