1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత శాసన మండలి ని రద్దు చేశారు.  ప్రజల ద్వారా ఎన్నుకున్న వ్యక్తులు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉండాలని చెప్పి శాసనమండలిని రద్దు చేశారు.  రద్దు చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.  శాసన మండలి కారణంగా పెద్దగా ఉపయోగం ఉండదు.  పైగా దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.  అందుకే అప్పట్లో ఎన్టీఆర్ దీనిని రద్దు చేశారు.  శాసనసభ ఒక్కటే అమలు ఉన్నది.  


కాగా, 2004లో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత శాసనమండలి వ్యవస్థను తిరిగి తీసుకొచ్చారు.  కేంద్రంలో లోక్ సభ, రాజ్యసభ రెండు ఉన్నట్టుగానే, రాష్ట్రంలో అసెంబ్లీ, శాసనమండలి ఉండాలని చెప్పి దీనిని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఈ మండలిని కొనసాగిస్తూ వస్తున్నారు.  వైఎస్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.  ఆ తరువాత 2014లో రాష్ట్రం రెండుగా విడిపోయింది.  


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు చోట్ల శాసనమండలిలు ఉన్నాయి.  2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది.  ఆ సమయంలో శాసనమండలిని కొనసాగించారు.  2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పధకాలు తీసుకొచ్చింది వైకాపా.  ఇందులో ఇంగ్లీష్ మీడియం, ఇంకా కొన్నింటికి సంబంధించిన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది.  


శాసనసభలో ఈ బిల్లులు పాస్ అయినా, శాసనమండలిలో ఆగిపోయింది.  ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నది.  దీంతో శాసనమండలిలో బిల్లు వీగిపోవడంతో జగన్ కు కోపం వచ్చింది.  అసలు శాసనమండలి ఎందుకు అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది.  శాసనమండలిని రద్దు చేస్తే... దాని వలన ఖర్చు తగ్గుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా సమాచారం.  మరి శాసనమండలిని రద్దు చేయడానికి వైకాపా నాయకులు ఒప్పుకుంటారా చూడాలి. శాసనమండలిని రద్దు చేయడం వలన బిల్లులు పాస్ చేసుకోవచ్చనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: