కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వి  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని భగ్గుమంటున్నక్రమంలో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి అప్రకటిత ఎమర్జెన్సీయేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనలు హోరెత్తడంతో 144 సెక్షన్‌ ను  ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో పలుచోట్ల  విధించడం, 18 మెట్రో స్టేషన్లను మూసివేసిన నేపథ్యంలో దేశంలో బీజేపీ పాలన సాగడం లేదని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు.144 సెక్షన్‌ ను  ‘దేశ రాజధానిలో ఎర్రకోట చుట్టూ  విధించారు, నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు.

 

సింఘ్వి 18 మెట్రో స్టేషన్లు మూసివేశారు..ఇంటర్‌నెట్‌ను కూడా నిలిపివేశారు.. 144 సెక్షన్‌ కర్ణాటకలోనూ అమలు చేస్తున్నారు.ఇదే తరహా యూపీ, అసోంలో  దమనకాండ కొనసాగుతోంద’ని  అన్నారు. డీ రాజా, సీతారాం ఏచూరి, అజయ్‌ మాకేన్‌, సందీప్‌ దీక్షిత్‌, యోగేంద్ర యాదవ్‌,ఉమర్‌ ఖలీద్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇది బీజేపీ పాలన కాదు అప్రకటిత ఎమర్జెన్సీ అని ఆయన  దుయ్యబట్టారు. మనుషులను పీక్కుతినేలా బీజేపీ పాలన సాగుతోందని మండిపడ్డారు.


ఈ సందర్బంగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాట్లాడితూ ... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటడంతో బీజేపీ శాంతిని భగ్నం చేసేందుకు కుట్ర పన్నుతోందని పశ్చిమ  మండిపడ్డారు. శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే సమయం  అల్లర్లకు పాల్పడేందుకు బీజేపీ కార్యకర్తలు ముస్లింలు ధరించే టోపీలు కొనుగోలు చేస్తున్నారని అన్నారు.

 

బీజేపీ కార్యకర్తలు ఓ వర్గాన్ని అప్రతిష్టకు గురిచేసేందుకు ఈ టోపీలు ధరించి  ఆస్తులను ధ్వంసం చేసే ఆలోచన చేస్తున్నారని హెచ్చరించారు. పౌర చట్టాన్ని హిందువులు, ముస్లింల మధ్య పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తోందని దీనిపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రిఫరెండం నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు. తన సవాల్‌ను స్వీకరించాలని ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం..మీరు ఓడిపోతే రాజీనామా చేయాలని అన్నారు. 1980లో పుట్టిన బీజేపీ 1970 నాటి మన పౌరసత్వ పత్రాలను అడుగుతోందని మమతా బెనర్జీ దుయ్యబట్టారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: