కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఉమ్మడి ఏపీలో టీడీపీ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణకు అనుకూలంగా ఉంటే...ఆంధ్రలో ఇబ్బంది. మద్ధతు ఇవ్వకపోతే తెలంగాణలో ఇబ్బంది. ఇదంతా కాదని రెండు కళ్ల సిద్ధాంతం నమ్ముకోవడం వల్ల తెలంగాణలో టీడీపీకి దారుణమైన డ్యామేజ్ జరిగింది. చివరికి తెలంగాణకు అనుకూలంగా ఉన్న అక్కడి వాళ్ళు బాబుని నమ్మలేదు. వారు టీఆర్‌ఎస్ వైపు వెళ్ళిపోయి టీడీపీ అడ్రెస్ లేకుండా చేశారు. అయితే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలు అయిపోయాయి. తెలంగాణలో టీడీపీ లేకపోయిన ఏపీలో బలంగానే ఉంది.

 

ఆ బలంతోనే 2014లో అధికారంలోకి రాగలిగింది. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అంతర్గతంగా బలంగానే ఉంది. అయితే టీడీపీకి అప్పుడు తెలంగాణలో ఏ పరిస్తితి ఎదురైందో ఇప్పుడు ఏపీలో అదే పరిస్తితి ఎదురవుతుంది. సీఎం జగన్ తాజాగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకురావడంతో టీడీపీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. సీఎం ప్రకటన చేయగానే అధినేత చంద్రబాబు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే బాబు వ్యతిరేకిస్తే పార్టీ మొత్తం వ్యతిరేకించినట్లే కానీ...ప్రస్తుతం పరిస్తితులు చూస్తే అలా కనిపించడం లేదు.

 

కర్నూలులో హైకోర్టు పెడతాం అని చెప్పడం వల్ల సీమ నేతలు జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. ఇటు విశాఖలో పాలన పరమైన రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పడంతో ఉత్తరాంధ్ర నేతలు కూడా జగన్‌కు జై కొడుతున్నారు. ప్రస్తుతానికి ముగ్గురు, నలుగురు టీడీపీ నేతలు బయటకొచ్చి జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన...రానున్న రోజుల్లో ఆ సంఖ్య పెరిగేలా కనిపిస్తుంది. దీని వల్ల బాబుపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. బాబు అమరవాతే రాజధాని అని కూర్చుంటే రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో పార్టీకి కష్టాలు తప్పవు.

 

సరే అని ఏదొరకంగా మూడు రాజధానులని అంగీకరించిన బాబుకు చిక్కులు తప్పవు. అసలు అమరావతి తీసుకొచ్చిందే ఆయన...అలాంటప్పుడు కాదని చెబితే కోస్తాలో పార్టీకి చుక్కలే. ఏదైనా ఈ మూడు రాజధానులు వలన బాబు పరిస్తితి ముందు నుయ్యి...వెనుక గొయ్యి మాదిరిగా అయిపోయింది.  

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: