తెలుగుదేశం పార్టీకి యువనేతలు లేరు అనే ఆవేదన ఎప్పటి నుంచో ఉంది. ఉన్న వాళ్ళను చంద్రబాబు, లోకేష్ పార్టీకి దూరం చేసారు. బలంగా ఉండే యువనేతల విషయంలో లోకేష్ అనుసరించిన వైఖరి, వాళ్ళు వెలుగులోకి వస్తే తనకు ఇబ్బంది అని చంద్రబాబులో ఉన్న భయం అన్నీ కలగలిసి పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. అది పక్కన పెడితే... పార్టీలో కాస్తో కూస్తో బలం ఉన్న యువనేతల్లో ఒకరైన కృష్ణా జిల్లాకు చెందిన యువ నాయకుడు దేవినేని అవినాష్ పార్టీకి రాజీనామా చేసారు.

 

తెలుగు యువత పదవి ఉన్నా సరే, ఆయన పార్టీకి రాజీనామా చేయడం ఆవేదన కలిగించింది. పార్టీ కోసం అవినాష్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అయినా ఆయ‌న‌కు చాలా అవ‌మానాలు ఎదుర‌య్యాయి. చివ‌ర‌కు ఓడిపోతాడ‌నే తెలిసే గుడివాడ సీటు బ‌లవంతంగా క‌ట్ట‌బెట్టారు. అక్క‌డ పోటీ చేసిన అవినాష్ కోట్లు పోగొట్టుకున్నాడు. పార్టీకి అంత క‌మిట్‌మెంట్‌గా ఉన్న యువ‌నేత అసలు ఆయనకు పార్టీ మారాల్సిన అవసరం ఏంటి...? దీని వెనుక ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. లోకేష్ ఉండగా పార్టీలో నువ్వు ఎదగడం కష్టం అనే విషయాన్ని ఒక ఎమ్మెల్యే అవినాష్ కి చెప్పారట.

 

ఆయన ఎవరో కాదు... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్... వీళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే... ఒక కార్యక్రమంలో వీళ్ళు ఇద్దరు కలిసారట. తనకు ఎక్కడ గుర్తింపు వస్తుందో అనే భయంతో లోకేష్ తన ప్రాధాన్యతను జిల్లాలో మీ బాబాయి దేవినేని అవినాష్ తో కలిసి తగ్గించారని, గన్నవరం నియోజకవర్గంలో వర్గాలు కూడా కొత్తగా వచ్చాయని చెప్పారట.

 

ఆయన ఉండగా నువ్వు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వాటిని విజయవంతంగా నడిపించడం అనేది ఎప్పటికి సాధ్యం అయ్యే పని కాదనే విషయాన్ని చెప్పారట. ఏ పదవి ఇప్పుడు లేదు కాబట్టి జగన్ త్వరగానే వైసీపీలో చేర్చుకునే అవకాశం ఉందనే విషయాన్ని కూడా వంశీ.. అవినాష్ చెప్పినట్టు తాజాగా బయటకు వచ్చింది... గుడివాడ కూడా వెళ్ళకుండా ఉంటె మంచిది అని చెప్పారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: