ప్ర‌ముఖ‌ హాస్య‌న‌టుడు అలీ, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రు అప్త మిత్రుల‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే అలీ ఇంట విషాదం నెల‌కొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్  ఆయ‌న్ని  ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌క‌పోవ‌డం  హాట్ టాఫిక్‌గా మారింది. అలీ త‌ల్లి గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అలీ ఇంటికి వెళ్లి ఆయ‌న్ని ప‌రామ‌ర్శించ‌గా, ప‌వ‌న్ మాత్రం ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌క‌పోవ‌డంతో ,  ఇప్పుడు ఎవ‌రి నోటా విన్న  ప‌వ‌న్ వెళ్లి ...  అలీ ని ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేద‌న్నప్రశ్నే  వినిపిస్తోంది.  రాజ‌కీయాలు ఈ ఇద్ద‌రు మిత్రుల మ‌ధ్య దూరాన్ని పెంచాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు అలీ, జ‌న‌సేన‌ను కాద‌నుకుని వైస్సార్సీపీలో చేరిన విష‌యం తెలిసిందే.

 

 దీంతో త‌న మిత్రుడు తాను స్థాపించిన  పార్టీలో చేర‌కుండా, ఇత‌ర పార్టీలో చేర‌డాన్ని ప‌వ‌న్ త్రీవంగా ఆక్షేపించారు. అలీపై   ఘాటైన విమ‌ర్శ‌లే చేశారు. ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌కు అలీ కూడా  ధీటుగా జ‌వాబిచ్చారు. దీంతో ఇద్ద‌రు మిత్రుల మ‌ధ్య దూరం పెరిగింది. ఇరువురు సినీరంగంలో కొన‌సాగిన‌న్నీ రోజులు మంచిమిత్రులైన‌ప్ప‌టికీ,  రాజ‌కీయాలు మాత్రం ఇద్ద‌ర్ని వీడ‌దీశాయ‌న్న వాద‌న‌లు లేక‌పోలేదు. అయితే ఎంత రాజ‌కీయ విరోధి అయినా త‌న మిత్రుడి ఇంట విషాదం నెల‌కొంటే, ప‌వ‌న్ వెళ్లి పరామ‌ర్శించ‌కుండా, కేవ‌లం ప‌త్రికాప్ర‌క‌ట‌న‌తోనే స‌రిపెట్టుకోవ‌డాన్ని ఎలా అర్ధం చేసుకోవాల‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

 

రాజ‌కీయంగా ఇద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న దూరం ఇంకా త‌గ్గ‌లేద‌ని, ఇప్ప‌టికీ ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు రకొన‌సాగుతున్న‌ట్లు అర్ధం చేసుకోవాలా? , లేక‌పోతే ప‌వ‌న్ న‌గ‌రంలో లేక‌పోవ‌డం వ‌ల్లే  వెళ్లి , అలీని ప‌రామ‌ర్శించ‌లేక‌పోయారా?? అన్న‌ది అంతుచిక్క‌డం లేదు. జ‌న‌సేనాని క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను కుటుంబంతో స‌హా క‌లిసి జ‌రుపుకునేందుకు విదేశాల‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అదే నిజ‌మైతే ఆయ‌న సోద‌రుడు చిరంజీవి, అలీకి ఈ విష‌యాన్ని చేర‌వేసి ఉంటారు. ఇక ప‌వ‌న్ వెళ్లి అలీని పరామ‌ర్శించ‌లేక‌పోయినా, మెగా కుటుంబ పెద్ద‌గా చిరంజీవి వెళ్లి ప‌రామ‌ర్శించార‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ స‌మ‌ర్ధించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: